వార్ 2 (X) కూలీ : అంతా తల్లకిందులు..!
1000 కోట్లు అంతకుమించి వసూలు చేస్తేనే పాన్ ఇండియా హిట్టు సినిమానా? ఇటీవలి కాలంలో ట్రెండ్ చూస్తుంటే ఇదే నిజమని అంగీకరించాలి.
By: Sivaji Kontham | 20 Aug 2025 10:05 AM IST1000 కోట్లు అంతకుమించి వసూలు చేస్తేనే పాన్ ఇండియా హిట్టు సినిమానా? ఇటీవలి కాలంలో ట్రెండ్ చూస్తుంటే ఇదే నిజమని అంగీకరించాలి. వార్ 2, కూలీ చిత్రాలు 500 కోట్లు, అంతకుమించి వసూలు చేస్తాయని అంచనా వేసారు. ఆరంభమే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, పాన్ ఇండియాలో బాగా ఆడితేనే 500 కోట్లు పైబడిన వసూళ్లు రాబట్టడం సాధ్యం. కానీ ఈ రెండు సినిమాలు మిశ్రమ స్పందనల కారణంగా బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. వార్ 2తో పోలిస్తే `కూలీ` చాలా ఉత్తమమైన వసూళ్లను సాధించింది. కానీ ఈ ఫలితం కూడా నిరాశే.
మొదటి వారంతంలో వార్ 2 కేవలం 180కోట్లు వసూలు చేయగా, కూలీ మాత్రం 350కోట్లు వసూలు చేయడం ఆసక్తిని కలిగించింది. రజనీ మానియా ముందు ఇతర పెద్ద హీరోల సినిమాలేవీ నిలబడలేదు. వార్ 2 ని బలహీనమైన కథతో ఎమోషన్స్ లేకుండా తెరకెక్కించాడని అయాన్ ముఖర్జీ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే, కూలీ కూడా సోసోనే... లోకేష్ మార్క్ మిస్సయందన్న విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఆ ఇద్దరు దర్శకులు ఫెయిలయ్యారు.
ఇక మొదటి వీకెండ్ రెండు పెద్ద సినిమాల వసూళ్లు కలిపినా 1000 కోట్లు రాలేదు. ఈ రెండూ 550కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. ఈ సోమవారం (వర్కింగ్ డే) నుంచి ఇరు సినిమాలకు వసూళ్లు తగ్గిపోయాయని ట్రేడ్ చెబుతోంది. ముఖ్యంగా సినిమాలకు ప్రతికూల సమీక్షలు పెద్ద మైనస్ గా మారాయి. ఇటీవలి కాలంలో వచ్చిన `సయ్యారా` లాంటి చిన్న చిత్రానికి ఉన్న దూకుడు కూడా ఈ పెద్ద సినిమాలకు కనిపించడం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. కూలీ, వార్ 2 ఇరు చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్ ని అధిగమిస్తాయని అభిమానులు అంచనాలు వేస్తే, అంతా తల్లకిందులైంది.
భారీ కాస్టింగ్.. భారీ బడ్జెట్లు..అద్భుతమైన లొకేషన్లు.. అంతకుమించిన భారీ ప్రమోషనల్ స్ట్రాటజీ.. ఎన్ని ఉన్నా, సినిమాలో కంటెంట్ లేకపోతే ఆడియెన్ తిరస్కరిస్తారనడానికి ఈ పెద్ద సినిమాలే ఉదాహరణ. భారీ యాక్షన్, హంగామా ఉన్నా కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. భావోద్వేగాల పరంగా కనెక్టవ్వకపోతే ప్రజలు తిరస్కరించడం ఖాయమని ప్రూవైంది.
