Begin typing your search above and press return to search.

కూలీ వర్సెస్ వార్ 2.. బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరిది పైచేయి?

ఆగస్టు నెలలో బాక్సాఫీస్ ముందుకు పలు సినిమాలు రానున్నాయి. అయితే అందరి కళ్లు కూలీ, వార్ 2 సినిమాలపైనే ఉన్నాయి.

By:  M Prashanth   |   5 Aug 2025 11:00 PM IST
కూలీ వర్సెస్ వార్ 2.. బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరిది పైచేయి?
X

ఆగస్టు నెలలో బాక్సాఫీస్ ముందుకు పలు సినిమాలు రానున్నాయి. అయితే అందరి కళ్లు కూలీ, వార్ 2 సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈనెల 14న థియటర్లలో రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన కూలీ ఓవైపు ఉంటే, మరోవైవు యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 ఉంది. ఈరెండు భారీ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఈ ఏడాది బాలీవుడ్ లో ఛావా సినిమా తప్ప, భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇంకోటి లేదు. విక్కీ కౌశల్ , రష్మిక మంధన్నా లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి విజయం సాధించి రూ.800 కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ నిలిచింది.

ఛావా మినహా ఆ రేంజ్ లో వసూళ్ల చేసిన సినిమా రాలేదు. ఇప్పుడు అందరి కళ్లు కూలీ, వార్ 2 సినిమాలపైనే ఉన్నాయి. ఈ సినిమాలకు జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరోవైపు, కూలీ నేరుగా రూ.1000 క్లబ్ లో చేరడమే టార్గెట్ గా పెట్టుకొని బరిలోకి దిగుతుంది.

అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్ ఉండడంతో తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే మంచి టాక్ ఉంటే రూ.1000 కోట్లు సాధించడం కూలీకి పెద్ద కష్టమేం కాదని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు. మరోవైపు, స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కూడా బాక్సాఫీస్ పోటీకి సై అంటోంది.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వల్ల ఓవరాల్ సౌత్ లో మార్కెట్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెల్స్, ఎన్టీఆర్- హృతిక్ మధ్య ఫైట్ సీన్స్ ఇలా ఈ సినిమాపై కూడా అంచనాలు మెండుగానే ఉన్నాయి. ఇప్పటికే ఇరు సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ట్రైలర్లు దేనికదే సాటి అన్నట్లుగా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ ఫైట్ లో ఏది పైచేయి సాధిస్తుందో, ఏ సినిమా ఛావా వసూళ్లును దాటుతుందో వేచి చూడాలి!