కూలీ - వార్ 2: 24 గంటల టికెట్ సేల్స్‌లో హోరాహోరీ పోరు
కూలీకి తమిళనాడులో స్ట్రాంగ్ బేస్ ఉండటం, అదనంగా తెలుగు, హిందీ వెర్షన్లకీ డీసెంట్ ఓపెనింగ్స్ రావడం ఈ సినిమాకు మద్దతు ఇస్తోంది.
By: M Prashanth | 15 Aug 2025 1:45 PM ISTస్వాతంత్ర్య దినోత్సవం లాంగ్ వీకెండ్ లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పోటీగా కూలీ - వార్ 2 పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీకి, హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన వార్ 2 కి మొదటి రోజు నుంచే భారీ హైప్ కనిపించింది. రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రావడంతో, సినీప్రియులలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ, డే 1లో రెండు సినిమాలు కూడా బలమైన కలెక్షన్లు సాధించాయి.
తాజాగా, రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లోనూ ఈ రెండు సినిమాలు బుక్ మై షో పోర్టల్ లో టికెట్ సేల్స్ లో దూసుకుపోతున్నాయి. రెండూ హాలీడే అడ్వాంటేజ్ ను బాగా వాడుకుంటూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. శనివారం, ఆదివారం, సోమవారం వరకూ ఈ మోమెంటమ్ కొనసాగితే కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలు రావొచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బుక్ మై షో లెక్కల ప్రకారం, వార్ 2 ఇప్పటివరకు 6,77,310 టికెట్లు అమ్ముకుంది. అదే సమయంలో, కూలీ తమిళ వెర్షన్ 6,23,550 టికెట్లు, హిందీ వెర్షన్ 91,140 టికెట్లు అమ్ముకుని, మొత్తం 7,14,690 టికెట్లను రాబట్టింది. అంటే టోటల్ టికెట్ సేల్స్ లో రజనీకాంత్ సినిమా స్వల్ప ఆధిక్యం సాధించింది. అయినప్పటికీ గంటల వారీ సేల్స్ లో వార్ 2 దూకుడు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెండు సినిమాలకు ఈ లాంగ్ వీకెండ్ గోల్డెన్ ఛాన్స్. ముఖ్యంగా హాలీడే సీజన్ కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తున్నారు. ఇదే స్పీడ్ లో కొనసాగితే, బాక్సాఫీస్ వద్ద రెండూ సేఫ్ జోన్ లోకి చేరవచ్చు. అయితే, అసలు పరీక్ష మాత్రం సోమవారం మొదలవుతుంది. ఆ రోజు నుండి వర్క్ డేస్ ప్రభావం కలెక్షన్లపై ఎంత ఉంటుందో చూడాలి.
కూలీకి తమిళనాడులో స్ట్రాంగ్ బేస్ ఉండటం, అదనంగా తెలుగు, హిందీ వెర్షన్లకీ డీసెంట్ ఓపెనింగ్స్ రావడం ఈ సినిమాకు మద్దతు ఇస్తోంది. మరోవైపు, వార్ 2 కి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్, హృతిక్ రోషన్ హిందీ మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతోంది. రెండు సినిమాలకూ ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ రావడం కూడా కలెక్షన్లను బలోపేతం చేస్తోంది. మొత్తం చూస్తే, ప్రస్తుతం టికెట్ సేల్స్ లో కూలీ స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ, పరిస్థితి ఎప్పుడైనా మారొచ్చు. లాంగ్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఎవరి ఆధిక్యం కొనసాగుతుందో, ఎవరు వర్క్ డేస్ లో బలంగా నిలబడతారో చూడాలి.
