వార్-2, కూలీ చిత్రాలు.. ఆ రేంజ్ ను అందుకోలేదా?
అలా రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ కు రెడీ అయ్యాయి.. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.. ఇప్పుడు రిలీజ్ అయ్యాక మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
By: M Prashanth | 15 Aug 2025 12:31 PM ISTసినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన కూలీ, వార్-2 సినిమాలు.. థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముందు ప్రమోషన్స్.. ఆ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ లో పోటీపడ్డ రెండు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఢీకొన్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ మూవీలో అనేక మంది స్టార్ నటీనటులు భాగమయ్యారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సాబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్, మహేంద్రన్ యాక్ట్ చేశారు. దీంతో విడుదలకు ముందే సినిమాపై ఆడియన్స్ లో వేరే లెవెల్ హైప్ క్రియేటైంది.
అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా వార్ 2. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించిన ఆ మూవీ.. తారక్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.
అలా రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ కు రెడీ అయ్యాయి.. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.. ఇప్పుడు రిలీజ్ అయ్యాక మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే రెండు సినిమాల ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లపై సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ సాగుతోంది. భారీ అంచనాలు ఉన్నా టాప్ రికార్డులు అందుకోలేదని అంటున్నారు.
నిజానికి వరల్డ్ వైడ్ గా తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితా టాప్-3లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ పుష్ప-2, ఆర్ఆర్ఆర్, బాహుబలి-2 చిత్రాలు ఉన్నాయి. ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే భారీ ఎత్తున గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో టాప్-3లో వేరే సినిమాలున్నాయి.
వరల్డ్ వైడ్ గా టాప్-2లో ఉన్న ఆర్ఆర్ఆర్.. తెలుగు స్టేట్స్ లో మాత్రం నెంబర్ స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్లేస్ ల్లో పుష్ప-2, దేవర సినిమాలు నిలిచాయి. ఇప్పుడు అటు వరల్డ్ వైడ్ గా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో టాప్-3లోకి వార్-2, కూలీ సినిమాలు వెళ్తాయని అంతా ఊహించారు. కానీ ఆ రేంజ్ నెంబర్స్ ను ఇప్పుడు రెండు సినిమాలు కూడా అందుకోలేదని తెలుస్తోంది.
