Begin typing your search above and press return to search.

కూలీ, వార్-2.. అదే జరిగితే థియేటర్లకు పండగే పండగ!

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూలీ, వార్-2 సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి.

By:  M Prashanth   |   14 Aug 2025 10:34 AM IST
కూలీ, వార్-2.. అదే జరిగితే  థియేటర్లకు పండగే పండగ!
X

రెండు పాన్ ఇండియా చిత్రాలు.. భారీ బడ్జెట్ సినిమాలు.. ఒకే రోజు విడుదల.. బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్.. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. సోషల్ మీడియాలో అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పోటాపోటీగా ప్రమోషన్స్.. ఫ్యాన్స్ వార్స్.. అలా కూలీ, వార్-2 సినిమా రిలీజ్ కోసమే తెగ డిస్కస్ చేసుకున్నారు.

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూలీ, వార్-2 సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ కూడా పడడంతో నెటిజన్లు, మూవీ లవర్స్ సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు ఎన్నాళ్లో వేచిన ఉదయమనే చెప్పాలి. రీసెంట్ గా మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ వద్ద కూడా పండుగ వాతావరణం నెలకొంది.

థియేటర్స్ ఓనర్స్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. క్యాంటీన్లు, పార్కింగ్ స్టాండ్స్ అన్ని కిక్కరిసిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిన్నటి వరకు కాస్త ఖాళీగా ఉన్న సిబ్బంది.. ఇప్పుడు బిజీగా బిజీగా ఉంటున్నారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో రెండు సినిమాలకు టికెట్స్ లేవు.

రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. మంచి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పాజిటివ్ టాక్ గానీ వస్తే.. బాక్సాఫీస్ వద్ద మామూలుగా ఉండదు పరిస్థితి. కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. రెండూ పాన్ ఇండియా చిత్రాలు కనుక.. థియేటర్స్ కు ఆడియన్స్ క్యూ కడతారు. రిపీట్ మోడ్ లో కూడా చూస్తారు.

గురువారం రెండు సినిమాలు రిలీజ్ అవ్వడంతో లాంగ్ వీకెండ్ వస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే అది పెద్ద బెనిఫిట్ గా మారుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అంతా రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మంచి వసూళ్లు వచ్చి.. లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం కొనసాగాలని అనుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.