Begin typing your search above and press return to search.

కూలీ vs వార్ 2 బాక్సాఫీస్: అప్పర్ హ్యాండ్ ఎవరిది?

లోకేశ్ కనగరాజ్- రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలపై తొలి నుంచీ ఫుల్ హైప్ ఏర్పడింది.

By:  M Prashanth   |   15 Aug 2025 10:54 AM IST
కూలీ vs వార్ 2 బాక్సాఫీస్: అప్పర్ హ్యాండ్ ఎవరిది?
X

మోస్ట్ అవెయిటెడ్ సినిమాలు కూలీ, వార్ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యాయి. లోకేశ్ కనగరాజ్- రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలపై తొలి నుంచీ ఫుల్ హైప్ ఏర్పడింది. ఇక ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఈ చిత్రాలు నిన్న బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి.

అయితే రెండు సినిమాల యూనిట్లు ప్రమోషన్స్ , ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో క్రేజ్ సంపాదించారు. ఈ రెండింటిని పోల్చితే.. మొదట్నుంచి కూలీకే వార్ 2 కంటే కాస్త హైప్ ఎక్కువ క్రియేట్ అయ్యింది. ఈ జోరు అడ్వాన్స్ బుకింగ్స్ లో నూ కనిపించింది. తాజాగా కలెక్షన్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ బాక్సాఫీస్ పోటీలో వార్ 2 పై కూలీ నెగ్గిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్, ఆక్యుపెన్సీ, హైప్ ఇలా ఓవరాల్ గా వార్ 2 ను కూలీ డామినేషన్ ప్రదర్శించింది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశారు. తన డైరెక్షన్ స్కిల్స్ తో భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తొలి రోజు కూలీ చాలా స్క్రీన్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శణమిచ్చాయి.

దీంతో ఓపెనింగ్ డే కూలీ భారీ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓపెనింగ్ డే కూలీ హవా నడిచింది. ముఖ్యంగా చెప్పాలంటే వార్ 2 కంటే కూలీనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 కంటే కూలీ దాదాపు డబుల్ వసూల్ చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మూవీ టాక్ కూడా వార్ 2 కంటే కూలీనే కొంచెం బెటర్ గా ఉంది

ఇవాళ ఇండిపెండెన్స్ డే, రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో కూలీ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలుకొడుతుందని టాక్. అటు వార్ 2 కు కూడా పికప్ అయ్యేందుకు ఈ మూడు రోజులే ఉంది. చూడాలి మరి వీకెండ్ లో ఏం జరుగుతుందో.

కాగా, కూలీలో అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఉపెంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది.