ఆ రూల్‌ని బ్రేక్ చేస్తున్న కూలీ, థగ్ లైఫ్?
అయితే హిందీ బెల్ట్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కావాలంటే 8 వారాల తరువాతే ఓటీటీల్లోకి రావాలని బాలీవుడ్ మేకర్స్ రూల్ పెట్టారట.
By: Tupaki Desk | 10 May 2025 6:30 PMసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `కూలీ`. లోకేష్ కనగరాజ్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో భారీ స్టార్ కాస్ట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులోని కీలక పాత్రల్లో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, రెబా మోనికా జాన్ నటిస్తున్నారు. కీలకమైన గెస్ట్ క్యారెక్టర్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కనిపించనున్నారు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే మాసీవ్ ఐటమ్ నంబర్‌తో మెస్మరైజ్ చేయబోతోంది. భారీ హంగులతో భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిందీ బెల్ట్‌లో ఈ సారి భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం ప్లాన్‌ని కూడా రెడీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్స్ నడుస్తున్నాయి.
ఇక ఇదే తరహాలో మరో సీనియర్ హీరో కమల్ హాసన్ చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మణిరత్నంతో కలిసి చేస్తున్న మూవీ `థగ్ లైఫ్`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కమల్‌తో పాటు శింబు కీలక పాత్రలో నటించాడు. త్రిష, సాన్య మల్హోత్రా, పంకజ్ త్రిపాఠీ, జోజు జార్జ్ నటిస్తున్నారు. మణిరత్నం, కమల్‌హాసన్ కలిసి కథ అందించిన ఈ మూవీని కమల్, మణిరత్నంలతో కలిసి యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. సుధీర్ఘ విరామం తరువాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న సినిమా కావడంతో `థగ్ లైఫ్`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీని జూన్ 5న భారీగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ బెల్ట్‌లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట. ఇందు కోసం రజనీ కూలీ, కమల్ థగ్ లైఫ్ రూల్‌ని బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. తమిళ సినిమాలు 4 వారాల తరువాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిందీ బెల్ట్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కావాలంటే 8 వారాల తరువాతే ఓటీటీల్లోకి రావాలని బాలీవుడ్ మేకర్స్ రూల్ పెట్టారట.
ఈ రూల్‌కు ఈ రెండు సినిమాల మేకర్స్ సై అంటే హిందీ బెల్ట్‌లో మరీ ముఖ్యంగా పీవీఆర్, ఐనాక్స్ వంటి ప్రముఖ థీయేటర్ చైన్స్‌లో భారీ స్థాయిలో `కూలీ, థగ్ లైఫ్ రిలీజ్ అవ్వడం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రూల్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని, అలా వస్తే ఈ రెండు సినిమాలు ఉత్తరాదిలో బారీ స్థాయిలో రిలీజ్ కావడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే ఉత్తారాదిలో ఉన్న రజనీ, కమల్ అభిమానులకు పండగే.