కూలీ సినిమా ట్రైలర్.. సినిమాకి ప్లస్సా..మైనస్సా?
ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.
By: Tupaki Desk | 3 Aug 2025 1:14 PM ISTప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈయన డైరెక్షన్లో వచ్చిన విక్రమ్(Vikram), మాస్టర్ (Master), లియో(Leo) లాంటి సినిమాలు హిట్ కొట్టడంతో ఈయన డైరెక్షన్ పై అభిమానుల అంచనాలు సినిమా సినిమాకి పెరిగిపోతున్నాయి. అయితే అలాంటి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఇప్పుడు రజినీకాంత్ కూలీ మూవీ చేస్తున్నారు ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు రెండవ తేదీన ట్రైలర్ విడుదల చేశారు. దీనికి తోడు సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ట్రైలర్ తోనే సినిమాపై హైప్ తీసుకొస్తానని.. ఇటీవల లోకేష్ కనగరాజు కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. మరి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ కూలీ ట్రైలర్ సినిమాకి ప్లస్ అయిందా.. లేక మైనస్ గా మారిందా అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రజినీకాంత్ కూలీ మూవీ(Coolie Movie)కి పోటీగా బాలీవుడ్ మూవీ వార్-2(War-2) వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14నే విడుదలవుతున్నాయి. దాంతో ఈ రెండు సినిమాలకు భారీ హైప్ ఉంది. అయితే ఈ రెండింట్లో ఎక్కువగా కూలీ మూవీకే హైప్ ఉన్నట్టు కనిపించినప్పటికీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గింది అంటున్నారు ట్రైలర్ చూసిన నెటిజన్లు. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చే సినిమా అంటే భారీ అంచనాలు పెట్టుకుంటారు. కానీ తాజాగా వచ్చిన కూలీ మూవీ ట్రైలర్ మాత్రం అంత ఆసక్తికరంగా లేదని, కేవలం పాత్రలను పరిచయం చేయడానికే ట్రైలర్ ని చూపించినట్టు కనిపిస్తోందని ట్రోల్స్ చేస్తున్నారు.
పైగా కూలీ సినిమాలో నాగార్జున,ఉపేంద్ర (Upendra), శృతిహాసన్ (Shruti Haasan)వంటి తారాగణం ఉండడంతో సినిమాకి మరింత ప్లస్ అనుకోవచ్చు. కానీ ట్రైలర్ లో మాత్రం వీరి పాత్రలను పరిచయం చేయడంతోనే ముగించేసారంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇన్ని రోజుల వరకు కూలీ మూవీపై ఉన్న హైప్ మొత్తం ట్రైలర్ తో ఒక్కసారిగా తుస్సుమనిపించారు డైరెక్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్లో రజినీకాంత్
(Rajinikanth) సినిమాల్లో ఉండే మాస్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే మరో లేవల్ లో ఉంటుంది. ఆయన రేంజ్ ఏంటో ట్రైలర్లో కాదు సినిమాలోనే చూపిస్తారని అంటున్నారు.అయితే లోకేష్ మార్క్ విజువల్స్, స్టైలిష్ టేకింగ్ మాత్రం ట్రైలర్లో కనిపించలేదు. ట్రైలర్ చూస్తే మాత్రం టైమ్ ట్రావెల్ స్టోరీలా విజువల్స్ ఉన్నాయంటున్నారు అభిమానులు.
కానీ రజినీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి ఇలాంటి టైమ్ ట్రావెల్ స్టోరీలు సెట్ అవుతాయా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. మరి చూడాలి లోకేష్ కనగరాజ్ మార్క్ రజినీకాంత్ క్రేజ్ కూలీ మూవీకి ఏ విధంగా కలిసి వస్తుందో. ఇక రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో నాగార్జున(Nagarjuna) విలన్ గా నటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మరి లోకేష్ కనగరాజ్ చేసే ఈ కొత్త ప్రయోగంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
