Begin typing your search above and press return to search.

కూలి కోసం నాగ్ రిస్కు తీసుకుంటాడా?

కానీ నాగ్ మాత్రం 35 కోట్లు లోపల డీల్‌ను ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

By:  Tupaki Desk   |   22 May 2025 10:00 PM IST
కూలి కోసం నాగ్ రిస్కు తీసుకుంటాడా?
X

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీ కూలి ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. బిగ్ బడ్జెట్, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో యూనివర్స్‌ను తయారు చేస్తోంది. టీజర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే తమిళనాడులో హైప్ బీట్స్ మామూలుగా లేవు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడుతోంది. దీనికి కారణం.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారన్న విషయం.

తెలుగు రైట్స్ విషయంలో నాగ్ ముందుకొచ్చినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన లుక్‌కు మంచి స్పందన రావడంతో, తెలుగులో కూడా ఈ సినిమాకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే నాగ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలు కూడా రైట్స్ కోసం కూలి నిర్మాతలతో టచ్‌లో ఉన్నారు. అయితే నాగార్జున స్వయంగా నిర్మాతలతో మాట్లాడి ఈ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట.

చెన్నై వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత తెలుగు రైట్స్ ధరను 40 కోట్లుగా కోరుతున్నారని టాక్. కానీ నాగ్ మాత్రం 35 కోట్లు లోపల డీల్‌ను ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నాగార్జున సాధారణంగా బిజినెస్ విషయంలో చాలా ప్రాక్టికల్. తమిళ డబ్ సినిమాలకు తెలుగులో కలిసొచ్చే సందర్భాలు చాలా తక్కువ. గతంలో చాలానే రిస్క్ తీసుకున్న డీల్‌లు డిస్ట్రిబ్యూటర్లను దెబ్బతీశాయి.

ఇటీవలి కాలంలో కూడా అధిక ధరలకు తీసుకున్న తమిళ సినిమాలు పెద్దగా లాభాలు ఇవ్వలేదు. ఒకవేళ కూలికి పాజిటివ్ టాక్ రావాలంటే, భారీ ప్రమోషన్స్, స్పెషల్ మౌత్ టాక్ తప్పనిసరి. అందుకే నాగ్ ఈ డీల్‌లో ఎంత వరకూ ముందుకెళ్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మిగతా బయ్యర్ల పోటీతో ఈ డీల్ మరింత హీట్ పెరుగుతోంది. సన్ పిక్చర్స్ స్థాయిని బట్టి చూస్తే డిమాండ్ అధికమే కానీ, డబ్బు పెట్టేవారు మాత్రం లెక్కలతో అడుగేస్తున్నారు.

యాక్షన్, గ్లామర్, మ్యూజిక్, స్టార్ కాస్ట్ అన్నదానిపై పూర్తి నమ్మకంతోనే నాగార్జున ఈ సినిమాతో బిజినెస్ చేయాలని అనునుకుంటున్నారట. అదే జరిగితే, ఈ ప్రాజెక్ట్ ఆయన డిస్ట్రిబ్యూషన్ కెరీర్‌లో మరో మెరుగైన అడుగు కావచ్చు. అయితే ఇది రిస్క్ డీల్ అనే అభిప్రాయం మాత్రం ఇండస్ట్రీలో స్పష్టంగా వినిపిస్తోంది. ఏదేమైనా కూలి రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ తెలుగులో ఎవరికి ఈ డీల్ దక్కుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. నాగ్ ముందస్తుగా గేమ్‌లోకి దిగి తన పాత్రకి మార్కెట్ వాల్యూ చూపించగలిగితే, ఇది ఆఖరికి మంచి వ్యూహంగా నిలవొచ్చు.