ఆ కంపెనీ బాస్ ఎవరో? కానీ దండేసి దణ్ణం!
By: Tupaki Desk | 12 Aug 2025 5:04 PM ISTకాలేజ్ బంక్ కొట్టి సినిమాకెళ్తే ప్రిన్స్ పాల్ ఒప్పుకోడు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తెలిస్తే అంతెత్తున లేస్తారు. ఉద్యోగానికి సెలవు పెట్టి సినిమా కెళ్తానంటే బాస్ ఒప్పుకోడు. కానీ కంపెనీ సెలవిచ్చి... ఆ రోజు జీతాన్ని జేబులో పెట్టి... సినిమా టికెట్ కొనిచ్చి సినిమాకెళ్లు! నాయానా? అని ఏ కంపెనీ బాస్ అయినా చెబుతాడా? ఎవరూ చెప్పరు. కానీ `కూలీ` సినిమా కోసం ఓ కంపెనీ బాస్ అదే పని చేసాడు. ఆగస్ట్ 14న కంపెనీకి పెయిడ్ హాలీడే ప్రకటించారు. సినిమా టికెట్ కూడా కొనిచ్చారు. ఇంటర్వెల్ లో స్నాక్స్ కొనుక్కో వడానికి డబ్బులిచ్చారు.
ఎంచక్కా సినిమా ఎంజాయ్ చేసి మరుసటి రోజు ఆపీస్ కు రా బాబు అని నోటీస్ బోర్టులో ఆదేశిలిచ్చే బాస్ ఆ ఒక్కడే. ఆగస్టు 14న సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `కూలీ` రిలీజ్ అవుతున్న సందర్భంగా ఓ కంపెనీ ఉద్యోగులకు ఇలాంటి అవకాశం కల్పించింది. అంతే కాదు రజనీకాంత్ 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా అనాదశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కానీ ఆ కంపెనీ బాస్ ఫోటో కోసం ? మాత్రం ప్రయత్నాలు నెట్టింట జోరుగా సాగుతున్నాయి. ఆ బాస్ కనిపిస్తే మెడలో దండేసి..దణ్ణం పెట్టాలని ఉందని ఓ నెటి జనుడు పోస్ట్ పెట్టాడు. ఆ కంపెనీ బాస్ సూపర్ స్టార్ కి వీరాభిమానిలా ఉన్నాడు. అందుకే ఇలా ఉద్యోగులకు సెలవివచ్చి మరీ థియేటర్ కు పంపిస్తున్నా డు. ఇలాంటి అభిమానుల్ని సంపాదించుకోవడం రజనీకి మాత్రమే సాధ్యైమైందని మరోసారి ప్రూవ్ చేసారు. రజనీకాంత్ కు ఇలాంటి అభిమానులు భారత్ లో నే కాదు విదేశాల్లో కూడా ఉన్నారు.
రజనీ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ వేరు. పైగా ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. అందుకే కంపెనీలు కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీకి 1000 కోట్ల వసూళ్లు తెచ్చి పెడుతుందనే అంచనా లున్నాయి.
