Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ నాన్-టాలీవుడ్ గ్రాసర్స్.. కూలీ బ్రేక్ చేస్తుందా?

రజినీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "కూలి"పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   23 May 2025 8:45 AM IST
తెలుగు రాష్ట్రాల్లో టాప్ నాన్-టాలీవుడ్ గ్రాసర్స్.. కూలీ బ్రేక్ చేస్తుందా?
X

రజినీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "కూలి"పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తలైవా రీసెంట్ సక్సెస్ అయిన "జైలర్" తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో మంచి హైప్ కనిపిస్తోంది. కాగా దర్శకుడిగా లోకేశ్ ఉండటం వల్ల ఈ సినిమాపై యూత్‌లో కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇందులో శ్రుతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటం మరో ప్లస్ పాయింట్. ఈ మూవీ ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. స్పెషల్‌గా తెలుగులోనూ "కూలి" మంచి మార్కెట్‌ను కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సౌత్ బయ్యర్ల మధ్య కఠిన పోటీ మధ్య ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోనున్నాయని సమాచారం.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ అంచనాల ప్రకారం, "కూలి"కు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏపీ/తెలంగాణలో దాదాపు గ్రాస్ పరంగా రూ.80 నుంచి 85 కోట్ల మధ్య ఉండనుంది. అంటే థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల వరకు ఉండవచ్చని టాక్. ఈ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో నాగార్జున అన్నపూర్ణ కూడా ఉంది. ఇక ఇది సాధించడానికి రజినీ, లోకేశ్ కాంబినేషన్‌ కంటెంట్ తో మెప్పించాలి.

గతంలో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో మిశ్రమ స్పందన వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టయి. "జైలర్" మాత్రం 84 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అదే తరహాలో "కూలి"లో నాగార్జున వంటి టాలీవుడ్ యాక్టర్ ఉండటం వల్ల ఇది కూడా ప్లస్ పాయింట్ కానుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్రెజంటేషన్ ఉంటే "కూలి" కొత్త రికార్డులు సెట్ చేయవచ్చు.

ఇక ఇప్పటి వరకు తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు చేసిన సినిమాల లిస్టు ఇది:

AP/TSలో టాప్ 11 నాన్-టాలీవుడ్ గ్రాసర్స్ (తెలుగులో):

1. కేజీఎఫ్ చాప్టర్ 2 – 145 కోట్లు

2. అవతార్: ది వె ఆఫ్ వాటర్ – 100 కోట్లు

3. 2.0 (రోబో 2) – 93 కోట్లు

4. అనిమల్ – 86 కోట్లు

5. జైలర్ – 84 కోట్లు

6. జవాన్ – 83 కోట్లు

7. రోబో – 70 కోట్లు

8. కాంతారా – 58.8 కోట్లు

9. పఠాన్ – 56 కోట్లు

10. ఐ (మనోహరుడు) – 53 కోట్లు

11. అమరన్ – 51 కోట్లు

ఈ లిస్టు ప్రకారం "కూలి" టాప్ 5లో చేరాలంటే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. మరి తలైవా మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.