Begin typing your search above and press return to search.

రజనీ 'కూలీ'.. నెవ్వర్ బిఫోర్ ఓవర్సీస్ బిజినెస్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2025 4:45 PM IST
80 Cr For Coolie In Overseas
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ క్యాస్టింగ్ తో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో మూవీని లోకేష్ రూపొందిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతి హాసన్‌ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే ఆడిపాడగా, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నారు. రజనీ కాంత్.. కూలీ నెంబర్ 1421గా కనిపించనున్నారు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 14వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఐమ్యాక్స్ ఫార్మాట్ లో కూడా రిలీజ్ చేయనున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు మూవీ లవర్స్.. ఇటు రజనీ ఫ్యాన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్- రజినీకాంత్ కాంబోలో మూవీ రావడంతో మంచి హోప్స్ పెట్టుకున్నారు. పక్కాగా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు!

అయితే ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున కూలీ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూలీ ఓవర్సీస్ హక్కులకు రూ.80 కోట్ల ఆఫర్ వచ్చిందని ఇప్పుడు సినీ వర్గాలతోపాటు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే డీల్ సెట్ అయిందని కూడా తెలుస్తుండగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. భారీ అండ్ సూపర్ డీల్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఓ కోలీవుడ్ మూవీకి అంత ఎత్తున ప్రీ రిలీజ్ ఓవర్సీస్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి అని కూడా తెలుస్తోంది. రజనీ కాంత్, లోకేష్ కనగరాజ్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ వల్ల అది సాధ్యమైందని చెప్పాలి.

అదే సమయంలో కూలీ మూవీ.. కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. నెవ్వర్ బిఫోర్ కోలీవుడ్ సినిమాగా నిలవనుందని చెబుతున్నారు. అయితే సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కూలీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.