'కూలీ'.. ఆ ఇద్దరి గేమ్ ఛేంజ్ చేస్తుందా?
`కూలీ`లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ దాహా అనే అతిథి పాత్రలో మెరవబోతున్నారు. వీరిద్దరికి ఈ సినిమా కీలకంగా మారింది.
By: Tupaki Desk | 9 July 2025 9:26 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కూలీ`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. బిజినెస్ పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ క్రేజీ మూవీలోని కీలక పాత్రల్లో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న విషయం తెలిసిందే.
శృతిహాసన్, రెబా మోనిక హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తుండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తూ సర్‌ప్రైజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమీర్ ఖాన్ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ లుక్‌ని విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. `విక్రమ్`లో సూర్య `రోలెక్స్`గా కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆమీర్‌ఖాన్ కూడా అదే స్థాయిలో `కూలీ`లో అదరగొట్టే అవకాశం కనిపిస్తోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్న ఈ మూవీలో ఇద్దరు స్టార్ల భవితవ్యం లేలబోతోంది. ఈ సినిమాతో ఇద్దరు క్రేజీ స్టార్ల గేమ్ ఛేంజ్ కాబోతోందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. `కూలీ`లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ దాహా అనే అతిథి పాత్రలో మెరవబోతున్నారు. వీరిద్దరికి ఈ సినిమా కీలకంగా మారింది. గత కొంత కాలంగా సరైన హిట్‌లు లేక సతమతమవుతున్న వీరిద్దరూ ఈ సినిమాతో కొత్త దారి పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకే కూలీ వీరిద్దరి గేమ్‌ని ఛేంజ్ చేస్తుందని, సరికొత్త గేమ్‌ని వీరితో స్టార్ట్ చేయిస్తుందని అంతా చర్చించుకుంటున్నారు. ఇందులో నాగార్జున సిమోన్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నాగ్ క్యారెక్టర్ ఉండటంతో ఇది ఆయనకు బిగ్ గేమ్ ఛేంజర్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. నాగ్ గత కొన్ని రోజులుగా ఈ మూవీలో తను చేసిన క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఊవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో నాగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది.
ఇక అమీర్ కూడా ఇదే తరహాలో `కూలీ` రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. తొలి సారి ఆమీర్ సౌత్ మూవీలో అతిథి క్యారెక్టర్ చేయడం, `సితారే జమీన్‌పర్`మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అంతా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే తరహాలో ఆమీర్‌ఖాన్ కూడా `కూలీ` మూవీకి వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీలో తన క్యారెక్టర్‌కు అప్లాజ్ లభిస్తే తన గేమ్ ఛేంజ్ అవుతుందని, అది అతని కెరీర్‌కు కొత్త బాటలు వేస్తుందని బాలీవుడ్ టాక్. ఏం జరగనుందన్నది తెలియాలంటే జూలై 14 వరకు వేచి చూడాల్సిందే.
