Begin typing your search above and press return to search.

ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ దంచుడేంది రాజా?

'ఎల్ సీ యూ' లాంచ్ అయిన త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ ఏ సినిమా చేసినా? `ఎల్ సీయూ`తో లింక్ పెట్టి మాట్లాటం అన్న‌ది ప‌రిపాటిగా మారింది.

By:  Tupaki Desk   |   24 July 2025 3:43 PM IST
ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ దంచుడేంది రాజా?
X

`ఎల్ సీ యూ` లాంచ్ అయిన త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ ఏ సినిమా చేసినా? `ఎల్ సీయూ`తో లింక్ పెట్టి మాట్లాటం అన్న‌ది ప‌రిపాటిగా మారింది. తొలుత ` ఖైదీ` రిలీజ్ అయింది. అనంత‌రం యూనివ‌ర్శ్ లో భాగంగా `విక్ర‌మ్` చేసాడు. ఈ రెండు సినిమాల‌కు లింక్ ఉంద‌ని `విక్ర‌మ్` లో లీడ్స్ ని బ‌ట్టి తేలిపోయింది. అటుపై విజ‌య్ ద‌ళ‌ప‌తితో `లియో `చేసాడు. `లియో` ఓ కొత్త‌గా ప్రారంభ‌మైనా? అందులో ఎల్ సీయూ కి సంబంధించిన లీడ్స్ ఉన్నాయి. దీనికి తోడు అదే హీరోతో `లియో 2` కూడా చేస్తాన్నాడు.

అది పార్తీబ‌న్ టైటిల్ తో చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం లొకేష్ క‌న‌గ‌రాజ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో `కూలీ` సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎల్ సీయూతో ఎలాంటి సంబంధం లేని ఓ కొత్త ప్రాజెక్ట్ గా దీన్ని ప్ర‌క‌టించాడు. అయినా స‌రే యూనివ‌ర్శ్ లో భాగ‌మే అంటూ నెట్టింట ప్ర‌చారం మాత్రం ఆగ‌లేదు. `కూలీ` మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ కు చేరుకున్నా? ఇంకా ఆ ప్ర‌చారం మాత్రం ఆగ‌లేదు. మ‌రోవైపు లోకేష్ ఎల్ సీయూతో సంబంధం లేద‌ని మొత్తుకుంటున్నా? ఎవ‌రూ వినే ప‌రిస్థితుల్లో క‌నిపించ‌డంలేదు.

ఈ విష‌యంలో లోకేష్ నెటి జ‌నుల్ని చీటింగ్ చేసే `కూలీ` సినిమా చేస్తున్న‌ట్లు ప్రచారం పీక్స్ లో జ‌రుగుతోంది. `కూలీ`కి...క‌మ‌ల్ హాస‌న్ తో తీసిన `విక్ర‌మ్` సినిమాకు లింక్ ఉందంటూ కొత్త ప్ర‌చారం మొద‌లైంది. విక్ర‌మ్ కు సంబంధించిన లీడ్స్ కూలీలో క‌నిపించే అవకాశం ఉంద‌నే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ ప్ర‌చారం కొన్ని రోజుల‌గానే జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలో తాజాగా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసాడు.

`కూలీ` కమల్ హాసన్ గారు చెయ్యలేరు. `విక్రమ్` రజినీకాంత్ గారు చెయ్యలేరు. కాబ‌ట్టి రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. `కూలీ` పూర్తిగా కొత్త సినిమా అని మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. మ‌రి ఇప్ప‌టికైనా ఈ ప్ర‌చారం ఆగుతుందా? కొన‌సాగుతుందా? అన్న‌ది చూడాలి. `కూలీ` చిత్రాన్ని ఆగ‌స్టులో రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే రోజున `వార్ 2` కూడా రిలీజ్ అవుతుంది. దీంతో రెండు చిత్రాల మ‌ధ్య బిగ్ ఫైట్ త‌ప్ప‌ని స‌రైంది.