కూలీతో ఆన్సర్ ఇస్తాడా?
తాజా సమాచారం ప్రకారం కూలీ ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 5:24 AMకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూలీ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కూలీ ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
అయితే అనిరుధ్ నుంచి ఆఖరిగా వచ్చిన వేట్టయాన్, విదాముయార్చి సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై చాలానే విమర్శలు వచ్చాయి. అనిరుధ్ నుంచి ఈ సినిమాలకు ఆశించిన మ్యూజిక్ రాలేదని, నెమ్మదిగా అనిరుధ్ కూడా అందరిలానే అవుట్‌డేటెడ్ అయపోతున్నాడని కామెంట్స్ కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అనిరుధ్ నుంచి రాబోతున్న కూలీ ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అవడం అనిరుధ్ కు చాలా ముఖ్యం. గత రెండు సినిమాలుగా ఎక్స్‌పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోతున్న అనిరుధ్ ఇప్పుడు కూలీ ఫస్ట్ సింగిల్ తో సమాధానం చెప్పి, తన సత్తాను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోలీవుడ్ లో కూలీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కోలీవుడ్ లోనే కాకుండా లోకేష్- రజినీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా కూలీకి మంచి బజ్ ఉంది. కాబట్టి ఈ సినిమాకు అనిరుధ్ మంచి సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే అతని పనితనం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటూ వేట్టయాన్, విదాముయార్చితో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కు కూడా అనిరుధ్ ఈ సినిమాతో సమాధానం చెప్పినట్టవుతుంది. ఈ నేపథ్యంలో కూలీ సినిమా మ్యూజిక్ అనిరుధ్ కు లైఫ్ లైన్ కాబోతుందని చెప్పొచ్చు. అనిరుధ్ కూలీ సినిమాకు ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడో చూడాలి.