రజిని - నాగ్ లేకుండానే పూజా ఐటమ్ సాంగ్?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కూలీ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.
By: Tupaki Desk | 12 July 2025 11:00 AM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కూలీ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాలోని రెండవ పాట మోనిక విడుదలైంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా పూజా హెగ్డే గ్లామర్ టచ్ తో మెరిసిపోతున్నారు. సొగసైన అందం, కట్ డ్రెస్ తో తన స్టెప్పులతో యూత్ ని ఫిదా చేస్తోంది. అయితే అందరిలో ఆశ్చర్యం కలిగించేది.. ఈ పాటలో రజినీకాంత్, నాగార్జున లాంటి స్టార్ క్యాస్ట్ ఎవ్వరూ కనిపించకపోవడమే. హీరో లేకుండా ఐటమ్ సాంగ్ అనగానే ఆశ్చర్యం కలగకమానదు కదా.
మరో విషయం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. రజినీ సినిమా అని భావిస్తే, ఆయన చుట్టూ అన్ని సాంగ్స్, మాస్ ఎలివేషన్లు ఉండాలని అనుకుంటారు. కానీ ఈ పాటలో మాత్రం మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కనిపిస్తున్నాడు. కూలీ సినిమాకు సంబంధించి ఇది స్పెషల్ సాంగ్ అని తెలిసినప్పటికీ, ఇంత బడా కాస్ట్ ఉన్న సినిమాలో ఈ స్థాయిలో ఓ చిన్న యాక్టర్ కనిపించడం కొంతమందికి అసహ్యంగా కూడా అనిపిస్తోంది.
అయితే కొన్ని వర్గాల్లో సౌబిన్ పాత్రకు సినిమాలో ప్రాముఖ్యత ఉండొచ్చన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం కూలీ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతోంది. ఆగస్టు 14న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక మలయాళ మార్కెట్ ను డామినేట్ చేసేందుకు ఆ భాషకు చెందిన సౌబిన్ ను హైలెట్ చేసినట్లు మరో వర్గం కామెంట్ చేస్తోంది.
అయితే తమిళ్ సినీ వర్గాలు ఈ సినిమాను తమిళనాడు నుంచి వచ్చే తొలి 1000 కోట్ల సినిమా అవుతుందన్న నమ్మకంతో చూస్తున్నాయి. బహుశా లోకేష్ కూడా అదే ప్లాన్ లో క్యాస్టింగ్ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కోసం అమీర్ ఖాన్ ఉండడం మరో ఆసక్తికరమైన విషయం. మోనిక సాంగ్ చూసిన తర్వాత, పాట రిలీజ్ దశలో కూడా కూలీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు లోకేష్ ధృవీకరించారన్న భావన పెరిగింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కూలీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూలై చివరినల్లా ఫైనల్ కాపీ రెడీ చేసే పనిలో టీమ్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలోకి రావొచ్చని తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐమ్యాక్స్ లోనూ సినిమా విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజినీకాంత్ ఈ సినిమాకు రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, లోకేష్ మాత్రం బీజీఎం, ఎడిటింగ్ పై ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు.
