కూలీలో మెయిన్ హైలైట్ అదేనట!
మా నగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 26 Jun 2025 7:37 AMమా నగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరిట ఓ యూనివర్స్ ను క్రియేట్ చేసి అందులో సినిమాలు చేస్తూ వస్తున్న లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కూలీ సినిమాను మాత్రం లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ ఎలోన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్- లోకేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అందరికీ కూలీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఇంకొంచెం పెంచుతూ ఈ సినిమాలో నాగార్జునను విలన్ గా నటింపచేశారు లోకేష్.
కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా కూలీలో కీలక పాత్ర చేస్తున్నారు. వీరందరితో పాటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూలీ సినిమాలో నటించనున్నారని కొన్నాళ్ల నుంచి వార్తలొస్తుండగా, సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో ఆమిర్ తాను కూలీలో నటించినట్టు కన్ఫర్మ్ చేశారు. కూలీలో తన పాత్ర క్లైమాక్స్ లో వస్తుందని, ఆ సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఊరించారు కూడా.
అయితే ఇప్పుడు కూలీ సినిమాలో ఆమిర్ పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. కూలీ సినిమా క్లైమాక్స్ లో 15 నిమిషాల హై ఆక్టేన్ ఎపిసోడ్ లో ఆమిర్ ఖాన్ ఓ పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని, ఇద్దరు స్టార్ల మధ్య యాక్షన్ తో కూడిన ఈ సీన్స్ కూలీ సినిమాకి అతి పెద్ద హైలైట్లలో ఒకటిగా నిలవనుందని, ఈ క్లైమాక్స్ సీన్ ను రాజస్థాన్ లో షూట్ చేశారని తెలుస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన కూలీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కూలీ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.