Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు 'ఏ' ఒక వ‌రంలా!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌గ‌న‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన `కూలీ` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Dec 2025 8:30 AM IST
ఆ సినిమాకు  ఏ ఒక వ‌రంలా!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌గ‌న‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన `కూలీ` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ర‌జ‌నీకాంత్-లోకేష్ ఇమేజ్ తో భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావ‌డంతో? ఇది సాధ్య‌మైంది. కానీ సినిమా చూసిన ఆడియ‌న్స్ రోటీన్ చిత్రంగా తేల్చేసారు. రివ్యూలు స‌హా టాక్ ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. మ‌రి ఇన్ని కోట్ల వ‌సూళ్లు ఎలా సాధ్య‌మంటే? ఇద్ద‌రి ఇమేజ్ ఓ కార‌ణ‌మైతే? చిత్రానికి సెన్సార్ `ఏ` స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డం మ‌రో కార‌ణంగా తాజాగా హైలైట్ అవుతోంది.

`ఏ` అనే బ్రాండ్ భారీ ఓపెనింగ్స్ అనంత‌రం క‌లిసొచ్చిన అంశంగా మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో `ఏ` రేటెడ్ తో రిలీజ్ అయిన సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డం కూడా `కూలీ`కి క‌లిసొచ్చింద‌న్న‌ది మ‌రికొంత మంది అభిప్రాయం. `యూ/ ఏ` సర్టిఫికెష‌న్ ఉన్న సినిమాల‌కంటే `ఏ` స‌ర్టిఫికెట్ ఉన్న చిత్రాలకు వ‌స్తోన్న హైప్ కూడా కీల‌కంగా చెప్పొచ్చు. సాధార‌ణంగా ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్ సినిమా అంటే ఎంతో బాద్య‌త‌తో కూడు కున్న‌దై ఉండాలి. అన్ని సెక్ష‌న్ల ప్ర‌జ‌లు చూసేలా ఉండాలి. కానీ `కూలీ` కేవ‌లం 18 ఏళ్లు దాటిన వారు మాత్ర‌మే చూడ‌టానికి అర్హులు.

సినిమాలో డ్ర‌గ్స్ హింస‌తో కూడిన స‌న్నివేశాలు అధికంగా ఉండ‌టంతో? `ఏ` స‌ర్టిపికెట్ తో రిలీజ్ అయింది. ఒక‌ప్పుడు `ఏ` స‌ర్టిఫికెట్ తో సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోలు ఎంత మాత్రం అంగ‌క‌రించేవారు కాదు. అందుకు కార‌ణ‌మైన స‌న్నివేశాల‌కు క‌త్తెర వేసి? `యూ/ ఏ` స‌ర్టిఫికేష‌న్ వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకునే వారు. కానీ ఇప్పుడు స‌న్నివేశం అందుకు భిన్నంగా ఉందంటే? `ఏ` స‌ర్టిపికేష‌న్ అన్న‌ది మార్కెట్ లో ఎంత బ్రాండ్ గా మారింద‌న్న‌ది అద్దం ప‌డుతుంది. ఆ ర‌కంగా `కూలీ` సినిమాకు `ఏ` అన్న‌ది ఓ వ‌రమ‌నే చెప్పాలి.

అదే `ఏ `స‌ర్టిఫికేష‌న్ తో రిలీజ్ కాకుండా ఉంటే? వ‌సూళ్ల పై ఆ ప్ర‌భావం కొంత వ‌ర‌కూ ప‌డేది అన్న‌ది కాద‌న‌లేని నిజంగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. 500 కోట్లు వ‌సూళ్లు సాధించే చిత్ర‌మ‌య్యేది కాద‌ని అంటున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధ‌ర్` ఇప్ప‌టికే 750 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ సినిమాకు కంటెంట్ తో పాటు, ఏ స‌ర్టిపికేష‌న్ కూడా క‌లిసొచ్చింది అన్న‌ది అంతే వాస్త‌వం. సినిమాలో కృర‌త్వం శ్రుతి మించిన స‌న్నివేశాలెన్నో ఉన్నాయి. సినిమా విజ‌యానికి ఆ స‌న్నివేశాలు ఎంతో కీల‌కంగా ప‌ని చేసాయి అన్న‌ది అంతే నిజం.