Begin typing your search above and press return to search.

కంటెంట్ కింగ్.. మినీ బడ్జెట్ లో భారీ లాభాలు

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు అనే తెలుగు సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో కూడా ఇది బాగా వర్తిస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:23 AM GMT
కంటెంట్ కింగ్.. మినీ బడ్జెట్ లో భారీ లాభాలు
X

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు అనే తెలుగు సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో కూడా ఇది బాగా వర్తిస్తుంది. ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు, కాంబినేషన్స్ అంటూ ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. కాంబినేషన్స్ ఉంటేనే, లేదంటే హీరోలతోనే మూవీ మార్కెట్ అవుతుందని, డబ్బులు వస్తాయని నమ్ముతారు.

అయితే చాలా సందర్భాలలో ఇది రాంగ్ అని కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. సినిమా కథలో దమ్ముంటే స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకం కలిగిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అదే ధైర్యంతో నిర్మాతలు బలమైన కంటెంట్ లతో మూవీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోలతో మూవీస్ చేసిన కంటెంట్ లో దమ్ము లేకపోతే భారీ నష్టాలు వస్తున్నాయి.

ఆచార్య, భోళా శంకర్, రాధేశ్యామ్, ఏజెంట్, రీసెంట్ గా సైంధవ్ లాంటి సినిమాలు దీనిని ప్రూవ్ చేశాయి. అలాగే కంటెంట్ ఎప్పటికి కింగ్ అని నిఖిల్ కార్తికేయ 2 మూవీ నిరూపించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటి ఏకంగా 120 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తరువాత కన్నడంలో కేవలం 15 కోట్లతో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో చేసిన కాంతారా మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది.

ఏకంగా 400 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు హనుమాన్ మూవీ కూడా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలన్నీ కూడా బలమైన ఎమోషన్స్, స్ట్రాంగ్ కంటెంట్ కి ప్రాధాన్యత ఇచ్చి తెరకెక్కించినవే కావడం విశేషం.

యూనివర్శల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే యాక్షన్ కంటే ఎమోషన్స్ ముఖ్యం అని ఈ చిన్న సినిమాలు నిరూపించాయి. మన కల్చర్ మూలాల్లోకి వెళ్లి కథలని సిద్ధం చేసుకొని తెరపై ఆవిష్కరిస్తే భారతీయులందరూ కూడా కనెక్ట్ అవుతారు. దానినే కార్తికేయ 2, కాంతారా, ఇప్పుడు హనుమాన్ చిత్రాలు చేసి చూపించాయి.