కంటెంట్ ను బట్టి మూవీ సక్సెస్ అయినప్పుడు హీరో గొప్పతనం ఏముంది...
ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ ఫుల్ సినిమా కి ఉన్న పేరు ప్రఖ్యాతలు వేరు. హిట్ మూవీ వల్ల అందరికీ పేరు వస్తుంది. అదే ఒక ప్లాప్ సినిమా వల్ల అందరి కెరియర్లు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది.
By: Tupaki Desk | 15 Sept 2026 7:00 AM ISTఇండస్ట్రీ లో ఒక సక్సెస్ ఫుల్ సినిమా కి ఉన్న పేరు ప్రఖ్యాతలు వేరు. హిట్ మూవీ వల్ల అందరికీ పేరు వస్తుంది. అదే ఒక ప్లాప్ సినిమా వల్ల అందరి కెరియర్లు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక మూవీ హిట్ అయితే అది నా వల్లే సక్సెస్ అయిందనీ చాలా మంది చెప్పుకుంటారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడా, హీరోనా? కంటెంటా? ఈ విషయం గురించి మాటాడితే దీనికి సమాధానం చెప్పడం సులభమే, కానీ చాలా మంది హీరోల అభిమానులు దీన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు... రియల్టీలోకి వస్తే సినిమా కంటెంట్ బాగుంటే సినిమా సక్సెస్ అవుతుంది. అందులో నటించిన హీరోకి పేరు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి కంటెంట్ ఒక సాధారణ నటుడిని సైతం టాప్ హీరోగా మారుస్తుంది. ఇలా కాకుండా కొంత మంది స్టార్ హీరోలు మేము చేసిన సినిమాలు మా వల్లనే సక్సెస్ అవుతున్నాయనే అనే బ్రమ లో ఉంటారు. హీరోల వల్లనే సినిమాలు ఆడితే వాళ్ళు చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా! మరి ఆ హీరో చేసిన కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి. ఇంకొన్ని మూవీస్ ఎందుకు ప్లాప్ అవుతున్నాయని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు...అందుకే కంటెంట్ ఈజ్ కింగ్ అని కొంతమంది చెప్తున్నారు... నిజానికి హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు ఆడాలంటే కంటెంట్ లో దమ్ము ఉండాలి.
కంటెంట్ ఈజ్ కింగ్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు సైతం అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు... హీరో ఎవరు అనేది ఆ సినిమా మొదటి షో కి మాత్రమే ప్రేక్షకులను థియేటర్ కి తీసుకువస్తుంది. రెండో షో నుంచి హీరో పనికి రాడు కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకుడు మూవీ కి వస్తాడు. స్టార్ హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అని చెప్తారు కానీ ఒక సూపర్ హిట్ కంటెంట్ ఉన్న సినిమాలో వాళ్ళ హీరో కనిపించినప్పుడు మాత్రమే వాళ్లు కూడా వాళ్ల హీరోని ఇంకా ఎక్కువ లైక్ చేయడానికి అవకాశం ఉంటుంది... ఫైనల్ గా సినిమా సక్సెస్ కి కారణం కంటెంట్...అయితే కంటెంట్ బాగున్నప్పటికీ అది ఎక్కువ మంది కి రీచ్ అవ్వాలంటే దానికి మంచి క్రేజ్ ఉన్న హీరో కావాలి. దానివల్ల దర్శకుడు చెప్పే కంటెంట్ పెద్ద మొత్తంలో ఎలివేట్ అవుతుంది. కొంత వరకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది...
స్టార్ హీరో లేకపోయిన కంటెంట్ ఆడుతుంది కానీ ఎక్కువ మొత్తంలో రీచ్ అవ్వలేకపోవచ్చు. ప్రతి హీరో కి ఈ విషయం తెలుసు. దీన్ని కొందరు ఒప్పుకుంటే మరి కొందరు మాత్రం కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు... కారణం ఏంటంటే కంటెంట్ గొప్ప అంటే మా ఇమేజ్ తగ్గిపోతుందేమోనని ఆలోచిస్తున్నారు... కానీ ఫైనల్ గా హీరోలు మాత్రం బెస్ట్ కంటెంట్ తో రావడానికే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు...
