అదిరిపోయే రెస్పాన్స్ తో ఈటీవీ విన్ లో దూసుకుపోతున్న కానిస్టేబుల్ కనకం
అనగనగా, ఎయిర్ లాంటి ఒరిజినల్స్ తో వరుస విజయాలు సాధించి ఈటీవీ విన్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్ కనకం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 15 Aug 2025 9:06 PM ISTఅనగనగా, ఎయిర్ లాంటి ఒరిజినల్స్ తో వరుస విజయాలు సాధించి ఈటీవీ విన్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్ కనకం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో మెప్పించిన కానిస్టేబుల్ కనకం ఈ గురువారం (ఆగస్టు 14) రాత్రి నుండి ఈటీవీ విన్‌లో విడుదలై అద్భుతమైన టాక్ తో సక్సెస్ ఫుల్ స్ట్రీమ్ అవుతోంది.
ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా, హేమంత్ కుమార్ గారి నిర్మాణంలో ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ అలరుస్తోంది. ఈ సిరిస్ లో కీలక పాత్రల్లో కనిపించిన మేఘలేఖ, రాజీవ్ కనకాల తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే అవసరాల శ్రీనివాస్, తన అనుభవంతో కూడిన విభిన్నమైన పాత్రలో – ఊరి ప్రెసిడెంట్, వికలాంగుడిగా ప్రేక్షకులను మెప్పించారు.
ఈ కథలో శ్రీకాకుళం జిల్లా అడవిప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరిలో అమ్మాయిలు వరుసగా అదృశ్యమవుతుండగా, కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ కనకం ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎదురయ్యే సంఘటనల ప్రేక్షకులు థ్రిల్ పంచాయి. సస్పెన్స్, థ్రిల్, హారర్ అంశాలతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో వుంది.
దర్శకుడు ప్రశాంత్ దిమ్మల చాలా గ్రిప్పింగ్‌గా నడిపారు. వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయింది. మేఘలేఖ, రాజీవ్ కనకాల పాత్రలు ప్రేక్షకులు గుర్తిండిపోయేలా వున్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అద్భుతంగ వున్నాయి. DOP శ్రీరామ్, BGMతో సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్‌లో మాధవ్ గుళ్లపల్లి అత్యుత్తమ ప్రతిభ చూపించారు.
గమనించదగిన విషయం ఏమంటే, ఈటీవీ విన్ ఈ సిరీస్‌ను పైరసీ బారిన పడకుండా విజయవంతంగా నివారించింది. ఈ సిరీస్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే మంచి స్పందన వస్తుండగా, డిజిటల్ హక్కుల పరిరక్షణలో ప్రొఫెషనల్ యాక్షన్ తీసుకోవడం ద్వారా, కంటెంట్ మేకర్స్ కృషిని కాపాడడంలో ఈటీవీ విన్ విజయం సాధించింది. ఇది ఈ ఓటీటీ ప్లాట్‌ఫాం నాణ్యతను, కంటెంట్ పరిరక్షణలో చూపే పట్టుదలని సూచిస్తుంది.
ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన కథ, కథనాలు, టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు పైరసీ పట్ల తీసుకున్న జాగ్రత్తలతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.
