Begin typing your search above and press return to search.

వీడియో: వేశ్య‌ల అందాల ముందు తేలిపోయిన‌ మిస్సులు

ఇదిగో ఇక్క‌డ ఈ వీడియో చూశాక దీనిని మీరు కూడా అంగీక‌రిస్తారు.

By:  Tupaki Desk   |   11 March 2024 3:30 AM GMT
వీడియో: వేశ్య‌ల అందాల ముందు తేలిపోయిన‌ మిస్సులు
X

వారంతా మిస్ వరల్డ్ 2024 పార్టిసిపెంట్స్. ప్ర‌పంచ అందగ‌త్తెల‌లో మేలిమి బంగారాలు. అంద‌రూ ఓ చోటికి చేరి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అయితే ఇదే ప్ర‌ద‌ర్శ‌న‌లో వేశ్య‌ల‌తో పోటీప‌డాల్సి వచ్చింది. కానీ వేశ్య‌ల అందాల ముందు మిస్సులు తేలిపోయారు. ఒక ర‌కంగా మిస్ వ‌రల్డ్ పోటీదారులు దిగ‌దుడుపే అయిపోయారు. ఇదిగో ఇక్క‌డ ఈ వీడియో చూశాక దీనిని మీరు కూడా అంగీక‌రిస్తారు.

భ‌న్సాలీ హీరామండిలో వేశ్య‌పాత్ర‌లు పోషిస్తున్న‌ న‌టీమ‌ణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్‌లతో కూడిన ఫోటోఫ్రేమ్ లు ఇప్ప‌టికే ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌మైన వేశ్య పాత్ర‌ధారులు త‌మ‌వైన వ‌న్నె చిన్నెల‌తో హృద‌యాల‌ను గాయ‌ప‌రుస్తున్నారు. ఇప్పుడు అలాంటి అంద‌గ‌త్తెల‌తో క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపించే సాహ‌సం చేసారు మిస్సులు. వేశ్య పాత్ర‌ధారుల‌తో కలిసి మిస్ వ‌ర‌ల్డ్ పోటీదారులు ర్యాంప్ వాక్ చేశారు. హీరమండిలోని `సకల్ బాన్` అనే మొదటి పాటకు 20 మంది అందమైన మహిళలు కాస్ట్యూమ్స్‌లో నడిచారు. మిస్ వరల్డ్ పోటీదారులు సంజయ్ లీలా భన్సాలీ - నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామాండి ప్రపంచాన్ని కళ, సంగీతం, వస్త్రాలను ధ‌రించ‌డం ద్వారా ఆస్వాధించారు. వారు భారతీయ సంస్కృతి వారసత్వాన్ని అనుభవించి ఫ‌ల‌వ‌రించారు. భ‌న్సాలీ కథా ప్రపంచంలోని భారీత‌నం తాలూకా తీయ‌నైన‌ అనుభూతిని ఆస్వాధించారు. మిస్ వరల్డ్ 2024లో ఫాస్ట్ ట్రాక్ టాలెంట్ రౌండ్‌లో 13 మంది విజేతలు హీరామండి న‌టీమ‌ణుల‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేయ‌డం ఒక సెన్సేష‌న్.

భ‌న్సాలీ తన తొలి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `హీరామండి: ది డైమండ్ బజార్` కోసం ఇది స‌రికొత్త ప్ర‌చార ఎత్తుగ‌డ‌గా చెప్పుకోవాలి. ఇంతకు ముందెన్నడూ చూడని అంద‌మైన దృశ్యానికి సింబాలిక్ గా నిలుస్తూ.. మిస్ వరల్డ్ 2024 ప్రపంచ వేదికపై మొద‌టి పాట‌ స‌క‌ల్ బ‌న్ గ్రాండ్ లాంచ్ అయింది. హీరామాండి: ది డైమండ్ బజార్ షో మొదటి ట్రాక్‌లో ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలంతా కలిసి నడ‌క‌లు సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ ట్రాక్ టాప్ 13 పోటీదారులతో తారాగణం ర్యాంప్ షోని ప్రత్యక్ష ప్రసారం చేయ‌గా. 140కి పైగా దేశాల్లో వీక్షించ‌డం గొప్ప ప్ర‌చార ఎత్తుగ‌డ‌గా నిలిచింది.

సంజయ్ లీలా భన్సాలీ మిస్ వరల్డ్‌కు భారతదేశ గొప్ప సంస్కృతి అనుభవాన్ని అందిస్తూనే త‌న సినిమాకి ప్ర‌చారం చేసుకోగ‌లిగారు. హీరామండి త్వ‌ర‌లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రానుంది. హద్దులు దాటిన గాంభీర్యం! #హీరమండి రత్నాలు, మిస్ వరల్డ్ 2024 తారలతో కలిసి ..#సకల్‌బాన్‌తో ప్రపంచ వేదికపై వసంత ఆగమనాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు.. అని దీనికి ట్యాగ్ ఇచ్చారు. ప్ర‌తిభావంతులైన రాజా హసన్ పాడిన ఈ పాట‌కు అమీర్ ఖుస్రో సాహిత్యం అందించారు.