Begin typing your search above and press return to search.

వ‌రుణ్ తేజ్-గోపీచంద్ మ‌ధ్య పోటీ!

ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి.

By:  Tupaki Desk   |   19 Jan 2024 1:47 PM GMT
వ‌రుణ్ తేజ్-గోపీచంద్ మ‌ధ్య పోటీ!
X

మ్యాచో స్టార్ గోపీచంద్..మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ మ‌ధ్య తొలిసారి ఫైట్ జ‌ర‌గ‌బోతుందా? ఇద్ద‌రి మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా? నేనా? అని త‌ల‌ప‌డ‌బోతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఆప‌రేష‌న్ వాలెంటైన్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి.

రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమా రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాల‌కు నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇవ‌న్నీ ఆప‌రేష‌న్ వాలెంటైన్ ని ముందు వ‌రుస‌లో నిల‌బెడుతున్నాయి. వ‌రుణ్ డిఫ‌రెంట్ అటెంప్ట్ లు కూడా మంచి ఫ‌లితాలు సాధిం చాయి. దీంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇదే నెల‌లో రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ వ‌చ్చె నెల 16కి వాయిదా ప‌డింది. అయితే స‌రిగ్గా ఇదే రోజున గోపీచంద్ క‌థ‌నాయ‌కుడిగా `భీమ` కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ముందుగానే ఆ తేదీని ఫిక్స్ చేసుకుంది. కాబ‌ట్టి భీమ రిలీజ్ గ్యారెంటీ. ఇప్పుడిదే తేదికి వ‌రుణ్ తేజ్ సినిమా రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భీమ‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి.

ఇందులో గోపీచంద్ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. గోపీ చంద్ శైలి మాస్ అంశాల‌తో క‌న్న‌డ ద‌ర్శ‌కుడు హ‌ర్ష తెర‌కెక్కించాడు. ఇలా అగ్ర హీరోల చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రెండు సినిమాల‌తో పాటు `సుంద‌రం మాష్టారు` అనే మ‌రో చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. హ‌ర్ష చెముడు ప్ర‌ధాన పాత్ర‌లో క‌ళ్యాణ్ సంతోష్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌ల‌ సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన సినిమాల మ‌ధ్య బాక్సీఫీస్ వ‌ద్ద ఎలాంటి వాతావ‌ర‌ణం క్రియేట్ అయిందో తెలిసిందే.