Begin typing your search above and press return to search.

సునీల్ కష్టానికి గుర్తింపు దక్కినట్లే..!

ఈ మధ్యే ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఎంచుకుంటున్నారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 10:00 PM IST
సునీల్ కష్టానికి గుర్తింపు దక్కినట్లే..!
X

టాలీవుడ్ సినీ నటుడు సునీల్. పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్ ఉన్నారు. ఆయన ఏమీ చేయక్కర్లేదు. కేవలం ఓ డైలాగ్ చెబితే చాలు, ఎవరైనా కడుపుబ్బా నవ్వేయగలరు. అయితే, ఆయన కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టారు.

అందాల రాముడు తో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యారు. కానీ, మర్యాద రామన్న, మరో రెండు మూడు సినిమాలు తప్ప, పెద్దగా ఏవీ క్లిక్ కాలేకపోయాయి. దీంతో, అటూ హీరోగానూ, ఇటు కమెడియన్ గానూ రెండింటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. దీంతో, ఆయన ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారు. మళ్లీ కామెడీ చేయండి బ్రో అంటూ కామెంట్స్ పెట్టిన వారు చాలా మంది ఉన్నారు.

అయితే, ఈ మధ్యే ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఎంచుకుంటున్నారు. విరూపాక్ష, పుష్ప లాంటి సినిమాల్లో కనిపించారు. పుష్పలో నెగిటివ్ పాత్రలో మెప్పించాడు. కానీ, కమెడియన్ గా చూడలేకపోయాం అని బాధపడిన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయనకు తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయట. అది కూడా ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా కమెడియన్ రోల్స్ క్యూ కడుతున్నాయి.

కానీ, తెలుగులో కాకుండా, తమిళంలో ఆయనను తీసుకోవాలని అక్కడి మేకర్స్ భావిస్తున్నారట. ఇటీవల రజినీకాంత్ జైలర్ మూవీలో సునీల్ ఓ పాత్ర చేశారు. ఆ పాత్రకు ఆయన తన వంద శాతం న్యాయం చేశారు. ఇంకేమంది తమిళ ఫ్యాన్స్ ఆయన నటనకు ఫిదా అయిపోయారు. దీంతో, తమిళంలో ఇతర సినిమాల్లోనూ ఆయనను తీసుకోవాలని తమిళ నిర్మాతలు సునీల్ ని కాంటాక్ట్ అవుతున్నారట.

విచిత్రం ఏమిటంటే, జైలర్ మూవీలో సునీల్ పాత్రకు తమిళ ఆడియన్స్ ఫిదా అయినట్లు, తెలుగులో ఎవరూ ఎంజాయ్ చేయలేదట. ఇక్కడి వారికి నచ్చకపోతే ఏంటి? ఆయన కష్టం వృథా కాలేదు. ఆయన మళ్లీ బ్యాక్ టూ ఫామ్ లో కి రావడం ఖాయమని తెలుస్తోంది. మరి తమిళంలో ఆయనకు ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయో చూడాలి.