Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ కి అప్పులా.. ఫ్యాన్స్ కి షాక్..!

ఇంతకీ అసలు విషయం ఏంటంటే కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం గురించి అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:30 AM GMT
స్టార్ కమెడియన్ కి అప్పులా.. ఫ్యాన్స్ కి షాక్..!
X

స్టార్ హీరోలే కాదు స్టార్ కమెడియన్స్ కి సినిమాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో అయితే బ్రహ్మానందం, అలి, సునీల్, వెన్నెల కిశోర్ ఇలా అందరు కమెడియన్స్ తమ టాలెంట్ తో అంతకుమించిన కష్టంతో ఫైనాన్షియల్ గా సెట్ అయ్యారు. సినిమాల్లో వీరు నటిస్తున్నారు అంటే వారికి తగిన రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు. కమెడియన్స్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారెవరు కూడా అప్పుల పాలైన సందర్భాలు లేవు. ఉన్నా కూడా బయటకు తెలియనివ్వరు. కానీ లేటెస్ట్ గా ఒక స్టార్ కమెడియన్ తను చేసిన అప్పుల గురించి మరో హీరోని అడుగుతారని అన్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం గురించి అందరికీ తెలిసిందే. అతను చేసే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కమెడియన్ గా చేస్తూ వచ్చిన సంతానం ఈమధ్యనే హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. సోలో హీరోగా కూడా ప్రేక్షకులు తనని ఆశీర్వధించడంతో అతను అదే పంథాలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా సంతానం నటించిన వడక్కుపట్టి రామస్వామి సినిమా చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా కార్తీక్ యోగి డైరెక్ట్ చేశారు.

ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా సంతానం స్నేహితుడు ప్రముఖ హీరో ఆర్య అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో సంతానం మాట్లాడుతూ తను ఆర్య మంచి స్నేహితులమని అన్నారు. అంతేకాదు తను ఎక్కడికి వెళ్లినా ఆర్య గురించి అడుగుతారు.. ఆర్య ఎక్కడికి వెళ్లినా నా గురించి అడుగుతారు. అయితే మేమిద్దరం స్నేహితులమని అలా అడగరు.. తాము చేసిన అప్పుల వల్ల అలా విచారిస్తారని అన్నారు సంతానం. ఆయన విషయం సరదాగా చెప్పినట్టు అనిపించినా స్టార్ కమెడియన్ కి అప్పులేంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

సంతానం నటించిన ఈ లేటెస్ట్ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో కూడా తమ ప్రొడక్షన్ ని విస్తరించాలని చూస్తున్నారు. అందుకే అక్కడ సంతానంతో తొలి ప్రయత్నం చేశారు. తెలుగులో ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ స్టార్స్ తో పాటుగా టైర్ 2 హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. సంతానం సినిమా కేవలం తమిళంలోనే రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ హిట్ అయితే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారేమో చూడాలి.