Begin typing your search above and press return to search.

స్టార్ క‌మెడియ‌న్ ని రోడ్డున ప‌డేసిన సినిమా అది!

తాజాగా ఆ లెజెండ్ గురించి ప్ర‌ముఖ న‌టుడు కాక‌రాల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 2:30 AM GMT
స్టార్ క‌మెడియ‌న్ ని రోడ్డున ప‌డేసిన సినిమా అది!
X

ఇండియ‌న్ చార్లీ చాప్లిన్ రాజ‌బాబు వెండి తెర‌ని ఏలిన దిగ్గ‌జ న‌టుడు. అసాధార‌ణ ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించిన గొప్ప న‌టుడు. కామెడీ పాత్ర‌ల్లో ఆయ‌నో లెజెండ్. కామెడీలో కొత్త పంథాని ప‌రిచ‌యం చేసిన న‌టుడు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన కామెడీతో ఉర్రూత‌లూగించిన న‌టుడు. అప్ప‌టి త‌రం ద‌ర్శ‌కులు మెచ్చిన న‌ట దిగ్గ‌జం. న‌టుడిగానే కాదు నిర్మాత‌గానూ రాజ‌బాబు ప‌రిశ్ర‌మ‌లో రాణించారు. తాజాగా ఆ లెజెండ్ గురించి ప్ర‌ముఖ న‌టుడు కాక‌రాల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

'రాజబాబు నా కంటే ఒక ఏడాది పెద్దవాడు. అయినా నన్ను అన్నయ్య అనే పిలిచేవాడు. మా ఇద్దరి అనుబంధం వేరు . అది చివరి వరకూ కొనసాగింది. ఆయ‌న‌ది జాలి గుండె. ఎవ‌రైనా బాధ‌ప‌డు తున్నారంటే? చూసి ఉండ‌లేడు. అభిమానం ఎక్కువ‌గా చూపించేవాడు. మ‌నుషుల్ని ఎంతో గొప్ప‌గా ప్రేమిస్తాడు. ఆ న‌మ్మ‌కాన్ని వాళ్ల నిల‌బెట్టుకోలేక‌పోయిన‌ప్పుడు చాలా బాధ‌ప‌డేవాడు.

ఇలా ఒక‌సారి కాదు. చాలా సంద‌ర్భాల్లో జ‌రిగింది. న‌టుడిగా ఉన్న స‌మ‌యంలోనే నిర్మాత‌గానూ మారాడు. 'మనిషి రోడ్డున పడ్డాడు' అనే సినిమాను సొంత బ్యానర్లో తీయాలనుకుంటున్నానని రాజబాబు నాకు చెప్పాడు.

దీంతో నేను టైటిల్ నెగిటివ్ గా ఉంది అన్నాను. సినిమాపై నా సందేహాలు కూడా చెప్పేవాడిని. కానీ నా మాట‌లు ప‌ట్టించుకోలేదు. ధైర్యంగా ఆ సినిమాని నిర్మించాడు. ఆ సినిమాతో ఆయన ఆర్ధిక ప‌రిస్థితి తారుమారైంది.

ఇబ్బందులు త‌ట్టుకోలేక రోడ్డున ప‌డ్డాడు. క‌న్నీరు పెట్టుకున్నాడు. ఇలా ఆయ‌న క‌ష్ట సుఖాల్లో ఉన్నాను' అని అన్నారు. 'స‌మాజం' సినిమాతో 1960 రాజ‌బాబు న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో క‌మెడియ‌న్ గా ప్రేక్ష‌కుల్ని న‌వ్వించారు.

రాజ‌బాబు సినిమాలో ఉంటే ఓ బ్రాండ్ గా ఉండేది. రాజ‌బాబు కామెడీ కోస‌మే ప్రేక్ష‌కులు సినిమా చూసేవారు. చివ‌రిగా 'బంగారు భూమి' లో న‌టించారు. ఆ సినిమా 1982 లో రిలీజ్ అయింది. 1983 లో రాజ‌బాబు క‌న్నుమూసారు.