Begin typing your search above and press return to search.

ఆ రోజు ల్యాప్‌టాప్ లేకపోవడం వల్ల కోట్ల నష్టం...!

ఆ సమయంలో నా వద్ద ల్యాప్‌టాప్ ఉండి ఉంటే ఏదో ఒకటి చేసే వాడిని. ఆ రోజు నేను కోట్ల రూపాయలను నష్టపోయాను. మళ్లీ పరిస్థితి జీరోకు వచ్చింది.

By:  Tupaki Desk   |   12 March 2024 6:28 AM GMT
ఆ రోజు ల్యాప్‌టాప్ లేకపోవడం వల్ల కోట్ల నష్టం...!
X

కమెడియన్‌ గా ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాల్లో, చిన్న సినిమాల సినిమాలన్నింటిలో కూడా కనిపిస్తూ వచ్చిన రఘ కారుమంచి ఈ మధ్య కాలంలో ప్రతిభకు తగ్గ ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కెరీర్‌ లో ఎదుర్కొన్న ఒడి దొడుకులు, వ్యక్తిగత నష్టాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

రఘు మాట్లాడుతూ... బంజారాహిల్స్ లో జాబ్ చేస్తున్న సమయంలో బేగంపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌ లో ఉండేవాడిని. అదే అపార్ట్మెంట్‌ లో సురేందర్‌ రెడ్డి మరియు వినాయక్ లు కూడా ఉండే వారు. వారితో నాకు పరిచయం అయ్యింది. నా మాట తీరు మరియు హ్యూమర్‌ చూసి ఇద్దరూ కూడా వారు దర్శకులు అయ్యాక అవకాశాలు ఇస్తామని చెప్పేవారు.

అన్నట్లుగానే 2001 లో వినాయక్‌ గారు ఆది సినిమాకు గాను ఆఫర్‌ ఇచ్చారు. ఆ సినిమాలో యాక్టింగ్‌ తెలియకుండానే చేశాను. నేను ఎప్పుడు కూడా యాక్టింగ్‌ స్కూల్‌ కి వెళ్లలేదు. నేను ఒక పాత్ర చెప్తే దాన్ని ప్రవర్తిస్తాను అంతే. నటన నాకు తెలియదు. ఆది షూట్ సమయంలో రాజీవ్‌ కనకాల గారు కలిశారు. ఆయన నా పై చాలా అభిమానం చూపించే వారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం.

అదుర్స్‌ సినిమా రిలీజ్ అయ్యాక జాబ్ కి రిజైన్ చేశాను. పూర్తి స్థాయిలో సినిమాలు చేయాలి అనుకున్నాను. అప్పుడే నేను షేర్ మార్కెట్స్ లో పెట్టుబడి పెడుతూ ఉండే వాడిని. నాకు ఆ విషయాలపై చాలా అవగాహన ఉంది. అయితే ఒక రోజు షూటింగ్ కి ల్యాప్‌టాప్ లేకుండా వెళ్లాను. ఆ రోజు కొన్ని కారణాల వల్ల షేర్స్ భారీ మొత్తం లో పడిపోయాయి.

ఆ సమయంలో నా వద్ద ల్యాప్‌టాప్ ఉండి ఉంటే ఏదో ఒకటి చేసే వాడిని. ఆ రోజు నేను కోట్ల రూపాయలను నష్టపోయాను. మళ్లీ పరిస్థితి జీరోకు వచ్చింది. అప్పుడే జాబ్‌ చేస్తూ ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తానికి కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వచ్చాను అంటూ రఘు చెప్పుకొచ్చాడు.