Begin typing your search above and press return to search.

కమెడియన్ సత్య ఫ్యామిలీ.. కూతురి పేరు వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?

టాలీవుడ్‌ లో తన స్పెషల్ కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ సత్య గురించి ప్రేక్షకులకు తెలిసిన విషయాలు చాలా ఉన్నా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ కొంతమేర మిస్టరీగానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 May 2026 10:43 AM IST
కమెడియన్ సత్య ఫ్యామిలీ.. కూతురి పేరు వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?
X

టాలీవుడ్‌ లో తన స్పెషల్ కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ సత్య గురించి ప్రేక్షకులకు తెలిసిన విషయాలు చాలా ఉన్నా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ కొంతమేర మిస్టరీగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్.. మీడియా ముందు పెద్దగా కనిపించకపోవడంతో అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

నిజానికి.. ఆంధ్రప్రదేశ్‌ లోని అమలాపురం సమీపంలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన సత్య, సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో బీటెక్ ను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌ కు వచ్చారు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన, తర్వాత నటుడిగా మారి తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఆయనకు సూపర్ క్రేజ్ సొంతమైంది.

స్వామి రారా, ఛలో, మత్తు వదలరా వంటి చిత్రాలతో తన కామెడీ టైమింగ్‌ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల విడుదలైన మత్తు వదలరా 2 సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రాలకు గాను ఆయనకు SIIMA అవార్డులు కూడా లభించాయి. ఇప్పుడు లీడ్ రోల్ లో జెట్లీ మూవీలో నటించి.. నేడే (మే 1వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సత్య కుటుంబం గురించి బయటకు పెద్దగా సమాచారం రావడం చాలా రేర్. కొన్ని సందర్భాల్లో ఆయన భార్య, కూతురితో కలిసి తిరుమలకు సత్య వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా, వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే తాజాగా ఓ చిట్‌ చాట్ లో యాంకర్ సుమ కనకాల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సత్య తన కుటుంబం గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన తనకు ఇప్పటికే పెళ్లయిందని, తొమ్మిదేళ్ల కూతురు ఉందని తెలిపారు. ఆమె పేరు సుధీరా అని చెప్పడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఆ పేరుకి కారణం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. తన కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్‌ గా నిలిచిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుధీర్ వర్మపై ఉన్న గౌరవంతో తన కూతురికి ఆ పేరు పెట్టినట్లు సత్య వెల్లడించారు.

అయితే స్వామి రారా సత్య కెరీర్‌ ను పూర్తిగా మార్చేసిన చిత్రంగా చెప్పాలి. ఇందులో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. హీరో నిఖిల్ సిద్ధార్థకు ఫ్రెండ్ గా, తనదైన కామెడీతో మెప్పించిన సత్యకు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సక్సెస్ కు కారణమైన దర్శకుడిపై ఉన్న గౌరవాన్ని ఇలా తన కూతురి పేరుతో వ్యక్తం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏదేమైనా సిల్వర్ స్క్రీన్ పై నవ్వించే సత్య.. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో కూల్ గా, ఎమోషనల్ గా ఉండే వ్యక్తి అని కూతురికి పేరు పెట్టిన విషయంతో క్లియర్ గా అర్థమైంది.