Begin typing your search above and press return to search.

'నైంటీస్ మిడిల్ క్లాస్' దర్శకుడి 'స్వాతి టీచర్'

స్వాతి టీచ‌ర్.. ఆదిత్య రూపొందించ‌నున్న చిత్రం. ఇందులో స్వాతి టీచ‌ర్ పాత్ర‌ను క‌ల‌ర్స్ స్వాతి పోషించ‌బోతోంది.బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల హీరోగా నటించనున్నాడు.

By:  Tupaki Desk   |   17 April 2024 2:48 PM GMT
నైంటీస్ మిడిల్ క్లాస్ దర్శకుడి స్వాతి టీచర్
X

ఈ మధ్య కాలంలో తెలుగులో అత్యంత విజయవంతమైన వెబ్ సిరీస్ అంటే.. నైంటీస్ మిడిల్ క్లాస్‌యే. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో బెస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. కేవలం ఈ ఒక్క ఒరిజినల్‌తో ఈటీవీ విన్ యాప్ ఏకంగా 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఆ ఓటీటీ నిలబడడానికి ఈ సిరీసే ప్రధాన కారణం. ఆదిత్య హాసన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన సిరీస్ ఇది.

తక్కువ బడ్జెట్లో, బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలిచాడు ఆదిత్య. దీని తర్వాత 'ప్రేమలు' డబ్బింగ్ వెర్షన్‌కు అదిరిపోయే డైలాగులు రాసి ప్రశంసలు అందుకున్నాడతను. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా తన తొలి ఫీచ‌ర్ ఫిలింకి రెడీ అయ్యాడు ఆదిత్య. దాని గురించి అనౌన్స్‌మెంట్ కూాడా వచ్చేసింది.

స్వాతి టీచ‌ర్.. ఆదిత్య రూపొందించ‌నున్న చిత్రం. ఇందులో స్వాతి టీచ‌ర్ పాత్ర‌ను క‌ల‌ర్స్ స్వాతి పోషించ‌బోతోంది.బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల హీరోగా నటించనున్నాడు. 'బాహుబలి'లో యంగ్ ప్రభాస్‌గా నటించింది ఈ కుర్రాడే. అదే కాక చాలా సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. అతను ఇప్పుడు ఆదిత్య కొత్త సినిమాలో హీరోగా చేయబోతున్నాడు. 'కేరాఫ్ కంచరపాలెం' సహా పలు చిత్రాల్లో బాల నటిగా చేసిన నిత్యశ్రీ గోరు ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

'నైంటీస్ మిడిల్ క్లాస్'ను ప్రొడ్యూస్ చేసిన దర్శకుడు నవీన్ మేడారంయే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నాడు. ముందు ఇది కూడా వెబ్ సిరీస్ అన్న‌ట్లు వార్త‌లొచ్చాయి కానీ.. ఇప్పుడు అది సినిమా అని, థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతుంద‌ని వెల్ల‌డించారు. మరి 'నైంటీస్ మిడిల్ క్లాస్' తరహాలోనే మరోసారి ఆదిత్య మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.