Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ వేదిక‌పై కొలీగ్స్ భ‌రితెగింపు.. చివ‌రికిలా!

ఈ మొత్తం ఎపిసోడ్ లో సెల‌బ్రిటీల వివ‌రాల్లోకి వెళితే...కోల్డ్‌ప్లే కచేరీలో మాజీ ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్ న‌టి క్రిస్టిన్ కాబోట్ ని కౌగిలించుకుని క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   25 July 2025 10:12 PM IST
ప‌బ్లిక్ వేదిక‌పై కొలీగ్స్ భ‌రితెగింపు.. చివ‌రికిలా!
X

భ‌ర్త వ్యాపార ప‌ర్య‌ట‌న కోసం విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు భార్య ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ ఇక్క‌డ భార్య త‌న బాస్ తో క‌లిసి కోల్డ్ ప్లే క‌చేరీకి వెళ్లింది. అక్క‌డ ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఘాడంగా హ‌గ్ చేసుకుని షోని ఆస్వాధించారు. అయితే కోల్డ్ ప్లే క‌చేరీ అంటే మామూలుగా ఉంటుందా? లైట్నింగ్ చుట్టు ప‌క్క‌ల జంట‌ల‌పైనా ప‌డుతుంది క‌దా! అలా ఒక లైట్ ఒక‌టి హ‌గ్ ఇచ్చుకున్న రొమాంటిక్ క‌పుల్ పై ప‌డింది. ఇంకేం ఉంది ఆ హ‌గ్గు కాస్తా కెమెరాలో బందీ అయిపోయింది. భ‌ర్త ఇంకా టూర్ లో ఉండ‌గానే, ఈ వీడియో టీవీల్లో టెలీకాస్ట్ అయిపోయింది. దీని కార‌ణంగా భార్య దేశ‌మంతా వైర‌ల్ అయిపోయింది. ఆవిడ గారు చేసిన సిగ్గుమాలిన ప‌నికి భ‌ర్త ఫైరైపోయాడు. అస‌లే కొంత‌కాలంగా ఇద్ద‌రి మ‌ధ్యా స‌రిగా పొస‌గ‌డం లేదు. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తూ కోల్డ్ ప్లే షోలో ఇలా భార్య దొరికిపోయింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సెల‌బ్రిటీల వివ‌రాల్లోకి వెళితే...కోల్డ్‌ప్లే కచేరీలో మాజీ ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్ న‌టి క్రిస్టిన్ కాబోట్ ని కౌగిలించుకుని క‌నిపించాడు. భర్త ఆండ్రూ కాబోట్ జపాన్‌లో వ్యాపార పర్యటనలో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో కోల్డ్ ప్లే షోలో ఆండీ బైరాన్- క్రిస్టిన్ కాబోట్ జంట గుట్టును బ‌య‌ట‌పెట్టేసింది ఆ వీడియో. త‌మ‌పై ప‌డిన ఫోక‌స్ లైట్ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూసినా కుద‌ర‌లేదు. ఒక‌రు ముఖం క‌నిపించ‌కుండా వెన‌క్కి తిరిగితే, మ‌రొక‌రు ఏకంగా కిందికి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నించారు.

ప్ర‌స్తుతం ఈ జంట వివాహేత‌ర సంబంధం చ‌ర్చ‌గా మారింది. ముఖ్యంగా కోల్డ్ ప్లే క‌చేరీలో ఆ ఇద్ద‌రి గుట్టు బ‌య‌ట‌ప‌డిపోవ‌డం కాపురంలో చిక్కులు తెచ్చి పెట్టింది. ఆస‌క్తిక‌రంగా ఆండీ బైరాన్ కంపెనీలో క్రిస్టీన్ ఉద్యోగి కావ‌డంతో ఇప్పుడు ర‌చ్చ పీక్స్ కి చేరుకుంది. కంపెనీ నుంచి రాజీనామాలు చేయాలి అంటూ బోలెడంత ర‌చ్చ జ‌రుగుతోంది. ఆ వీడియో బ‌య‌ట‌ప‌డ్డాక‌ ఆండీ బైరాన్ ఆస్ట్రోనోమర్ కంపెనీకి రాజీనామా చేయడంతో అది మీమ్ ఫెస్ట్ కి దారి తీసింది. ఆమె కూడా తొంద‌ర్లోనే రాజీనామా చేసే అవ‌కాశం ఉంది.