దీపికను రీప్లేస్ చేసిన రష్మిక.. అసలేం జరుగుతోంది?
తాజా సమాచారం మేరకు, ఫ్రాంఛైజీ రెండో సినిమాలో పూర్తిగా తారాగణం మారుతుందని తెలిసింది.
By: Tupaki Desk | 6 Jun 2025 7:00 AM ISTబ్లాక్ బస్టర్ 'కాక్ టెయిల్' ఫ్రాంఛైజీలో కొత్త సినిమా వస్తోంది అంటే యూత్‌లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఫ్రాంఛైజీ మొదటి సినిమాలో దీపికా పదుకొనే- సైఫ్ అలీ ఖాన్ మధ్య రొమాన్స్ హృదయాలను దోచుకుంది. ఇందులో డయానా పెంటీ ఒక కీలక పాత్రను పోషించింది. పార్ట్ 1 విజయం సాధించిన తర్వాత హోమి అడాజానియా కాక్‌టెయిల్ 2ను రూపొందించడానికి సిద్ధమైనా కానీ, ఇంతకాలం ఇది సాధ్యపడలేదు.
తాజా సమాచారం మేరకు, ఫ్రాంఛైజీ రెండో సినిమాలో పూర్తిగా తారాగణం మారుతుందని తెలిసింది. మొదటి భాగంలో సైఫ్ ఖాన్ నటించగా, ఈసారి ఆ స్థానంలో షాహిద్ కపూర్ రీప్లేస్ చేస్తున్నాడు. కథానాయికలుగా కృతి సనన్, రష్మిక మందన్న ఈ సీక్వెల్‌లో భాగమవుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రొమాంటిక్ కామెడీ 2025 ఆగస్టులో సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు.. 'కాక్‌టెయిల్ 2' వచ్చే ఏడాది చివరి నాటికి పెద్ద స్క్రీన్‌లలోకి రావచ్చని అంచనా.
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం... భారతదేశం సహా యూరప్‌లోని కొన్ని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ప్రధాన తారాగణంతో పాటు టీమ్ విదేశాలకు వెళ్లేందుకు ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోందని తెలిసింది. ఈ రెండవ భాగానికి కూడా హోమి అడాజానియా దర్శకత్వం వహిస్తారు. దినేష్ విజన్ ఇంతకుముందు కాక్టెయిల్ కోసం ఇంతియాజ్ అలీతో కలిసి స్క్రిప్టును మలిచారు. కానీ సీక్వెల్ కోసం లవ్ రంజన్ పని చేస్తున్నారని సమాచారం.
షాహిద్ ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ తదుపరి చిత్రంలో నటిస్తున్నాడు. అర్జున్ ఉస్తారా అనేది మూవీ టైటిల్. కృతి విషయానికొస్తే ధనుష్ సరసన ఆనంద్ ఎల్ రాయ్ `తేరే ఇష్క్ మే` చిత్రంలో నటించింది. మరోవైపు రష్మిక, కాక్టెయిల్ 2 లో నటించే ముందు ఆయుష్మాన్ ఖురానాతో `థమా` షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
