Begin typing your search above and press return to search.

CK బ్యూటీ అరుదైన మైలురాయి

బికినీలు, స్విమ్ సూట్లు, చీర అందాలు, అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్ ల‌తో ఇప్ప‌టికే వెబ్ ని మ‌రిగించింది ఈ బ్యూటీ.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:48 AM GMT
CK బ్యూటీ అరుదైన మైలురాయి
X

బాలీవుడ్ స్టార్ దిశా పటానీ దేశవ్యాప్తంగా భారీ ఫాలోవ‌ర్స్ ని కలిగి ఉంది. నిరంత‌రం యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారుగా దిశా తన జీవితంలోని ఆసక్తికరమైన విష‌యాల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తుంది. దిశా షేర్ చేసిన వంద‌లాది ఫోటోలు ఇప్ప‌టికే వెబ్ లో సంచ‌ల‌నంగా మారాయి. బికినీలు, స్విమ్ సూట్లు, చీర అందాలు, అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ లుక్ ల‌తో ఇప్ప‌టికే వెబ్ ని మ‌రిగించింది ఈ బ్యూటీ. కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 6కోట్ల మంది (60 మిలియన్ల మంది) అనుచరుల మైలురాయిని సాధించింది. ఇది అరుదైన రికార్డ్.


తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ దిశా ఇలా వ్యాఖ్యానించింది. ``నా సీతాకోకచిలుకలు, ఎల్లప్పుడూ నాపై చాలా ప్రేమను కురిపిస్తున్నందుకు మరియు ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరంతా నాకు అందించిన ప్రేమ అభిమానం ప్రతిదానికీ నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీ అందరి కోసం మెరుగ్గా పని చేయాల‌ని ఆశిస్తున్నాను!`` అని అంది. దిశా తన సోషల్ మీడియాలో ఒక అందమైన సీతాకోకచిలుక స్నాప్‌ను షేర్ చేసి ఇలా రాసింది. ``ధన్యవాదాలు.. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను`` అని రాసింది.


మ‌రోవైపు దిశా ప‌టానీ మైఖేల్ కోర్స్ విందు కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా లైఫ్ స్టైల్ ఆసియా దిశా ప‌టానీ కొత్త లుక్ ని షేర్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. ``సెలబ్రిటీ క్లాన్ కంటే ఎవ్వరూ ఉత్సవాలను మెరుగ్గా చేయరు. LSA x మైఖేల్ కోర్స్ (@michaelkors) దీపావ‌ళి పార్టీ.. అయితే ఈ ఆలోచనకు ద్వితీయ స్థానం.. మొద‌ట ఈ సాయంత్రం కొన్ని ఆకర్షించే లుక్స్‌ని ఇక్కడ చూడండి`` అని వ్యాఖ్య‌ను జోడించింది. దిశా ప‌టానీ స‌హా ప‌లువురు అందాల మోడ‌ల్స్ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... దిశా మ‌రోసారి త‌న మాజీ టైగర్ ష్రాఫ్‌తో జతకట్టబోతున్నట్లు సమాచారం. ద‌ర్శ‌క‌నిర్మాత జగన్ శక్తి త‌దుప‌రి చిత్రం `హీరో నంబర్ 1`లో వీరిద్దరూ నటిస్తున్నారు. మొదట్లో సారా అలీ ఖాన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. కానీ సారా స్థానంలో దిశా వ‌చ్చి చేరింది. ఈ మార్పుపై ద‌ర్శ‌కుడు జ‌గ‌న్ శ‌క్తి స్పందిస్తూ “దిషా చాలా ఫిట్ ..యాక్షన్ చేయడానికి తగిన న‌టి. సారా క‌చ్చితంగా ఈ సినిమాలో భాగమే, కానీ దురదృష్టవశాత్తు కాల్షీట్ల‌తో అడ్జ‌స్ట్ కాలేక‌పోయాం`` అని తెలిపారు.


హీరో నంబర్ 1లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ టైగర్ ప్రేమికురాలిగా నటించనుంది. ఈ ప్రాజెక్ట్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన హీరోనం.1 కి సీక్వెల్ కాద‌ని తెలిసింది. 1997లో గోవింద-నటించిన చిత్రానికి రీమేక్ లేదా సీక్వెల్ కాదు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన `యోధా` విడుదలకు సిద్ధమవుతోంది.