Begin typing your search above and press return to search.

సామ్ సిటాడెల్.. ఈ మార్పు ఎందుకో?

సిటాడెల్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ సిరీస్ ను గతంలో ప్రైమ్ వీడియో కన్ఫామ్ చేసింది.

By:  Tupaki Desk   |   19 March 2024 12:22 PM GMT
సామ్ సిటాడెల్.. ఈ మార్పు ఎందుకో?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం కొత్త సినిమాలేం చేయడం లేదు. మయోసైటిస్ బారినపడ్డ సామ్.. ప్రస్తుతం కోలుకుంది. ఇదివరకే ఆమె బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్.. త్వరలోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.


అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల అనౌన్స్‌మెంట్ ను మంగళవారం (మార్చి 19) ముంబై వేదికగా జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్ లో చేసింది. ఆ సమయంలో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ గురించి కూడా ప్రస్తావించింది. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ను మార్చింది. సిటాడెల్‌: హనీ-బన్నీ గా ఫిక్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది.

"సిటాడెల్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ సిరీస్ ను గతంలో ప్రైమ్ వీడియో కన్ఫామ్ చేసింది. దీనికి సిటాడెల్: హనీ బన్నీ అనే టైటిల్ పెట్టాం. ఓ లవ్ స్టోరీతో పాటు అద్భుతమైన కథనం, ఉత్కంఠకు గురిచేసే ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. 90ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది" అంటూ రాసుకొచ్చింది. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ కూడా చేసింది.

అయితే పోస్టర్ లో హనీ బన్నీ పేర్ల అక్షరాల్లో సమంత, వరుణ్ ధావన్ కనిపిస్తున్నారు. వీరిద్దరూ చేతుల్లో గన్స్ పట్టుకొని సీరియస్ లుక్స్ లో ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్షన్ చేస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించింది. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో యాక్ట్ చేసిన సామ్.. సిటాడెల్ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది.

గత ఏడాది హాలీవుడ్ లో సిటాడెల్ పేరుతో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చిన సంగతి విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందులో నటించింది. రిచర్డ్‌ మ్యాడెన్‌ కూడా మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. ఇప్పుడదే ఇండియన్ వెర్షన్ గా రాబోతోంది. ఈ వెర్షన్ ను రుస్సో బ్రదర్స్‌ నిర్మించారు. మరి ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అవుతుందో? స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో? చూడాలి.