Begin typing your search above and press return to search.

మహేష్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే..

అలాగే సినిమాటోగ్రఫీ మీద మహేష్ కి చాలా నాలేజ్ద్ ఉందని లైటింగ్ నుంచి ఫ్రేమ్స్ వరకు ప్రతి ఒక్కటి అతనికి తెలుసని అన్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:07 AM GMT
మహేష్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా షూటింగ్ వేగంగా ఫినిష్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యుల్స్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేయడానికి రెడీ అయ్యారు.

సంక్రాంతి నాటికి రిలీజ్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస వర్క్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ విషయాలని ఆయన షేర్ చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 24 క్రాఫ్ట్స్ మీద పూర్తిగా అవగాహన ఉందని మనోజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అలాగే సినిమాటోగ్రఫీ మీద మహేష్ కి చాలా నాలేజ్ద్ ఉందని లైటింగ్ నుంచి ఫ్రేమ్స్ వరకు ప్రతి ఒక్కటి అతనికి తెలుసని అన్నారు. చిన్న లైటింగ్ తేడా వచ్చిన కూడా మహేష్ బాబు కనిపెట్టేస్తాడని, ఆ విషయంలో చాలా పెర్ఫెక్ట్ గా ఉంటారని మనోజ్ చెప్పడం విశేషం. మిగిలిన హీరోలు సినిమాటోగ్రఫీ అంతగా పట్టించుకోరు.

కాని మహేష్ బాబు మాత్రం చాలా అబ్జర్వేషన్ తో ఉంటారు. షూటింగ్ సెట్ లో అతను చాలా విషయాలు చెబుతారు. ఏ సీన్, సిచువేషన్ కి ఎలాంటి షాట్ బాగుంటుంది అనేది కూడా మహేష్ కి భాగా తెలుసు. అలా ఎందుకు పెట్టాలి అనేది కూడా చాలా క్లారిటీతో చెబుతారు. నాకు అతనితో వర్క్ చేయడం చాలా చాలేజింగ్, అతని ఆలోచనల కంటే బెటర్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటా అంటూ మనోజ్ పరమహంస చెప్పుకొచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా విజువలైజేషన్ పరంగా కూడా అంత పెర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ పై మహేష్ బాబు అద్భుతంగా కనిపిస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత అవగాహన ఉన్నవారిన ఒక్కసారి పొరపాట్లు చేస్తారని కొంతమంది నెటిజన్లు నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.