Begin typing your search above and press return to search.

వరల్డ్ నెం.1 డైరెక్టర్ ఓకే.. మరి మన నెం.1 ఎప్పుడిస్తారు?

వరల్డ్ నెం.1 డైరెక్టర్ అప్డేట్ ఇచ్చేశారని.. మరి మన నెం.1 డైరెక్టర్ ఎప్పుడిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. చాలా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:13 PM IST
వరల్డ్ నెం.1 డైరెక్టర్ ఓకే.. మరి మన నెం.1 ఎప్పుడిస్తారు?
X

ఫేమస్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గురించి తెలియని వారుండరంటే ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయన తీసే సినిమాలపై ప్రతీ ఒక్కరూ కంప్లీట్ ఫోకస్ పెడతారు. అప్ కమింగ్ మూవీల కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రజెంట్ జెనరేషన్ కు తగ్గట్టు సినిమాలు తీసే ఆయన.. అందరినీ మెప్పిస్తుంటారు. అందుకే ఆయనను వరల్డ్ నెం.1 డైరెక్టర్ అంతా ట్రీట్ చేస్తుంటారు.

రీసెంట్ గా ఓపెన్ హీమర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు ది ఒడిస్సీ మూవీ తెరకెక్కిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఆయన.. ఆ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్ తో రూపొందిస్తున్నారు. రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ గురించి క్రేజ్ అప్డేట్ ఇచ్చారు. జురాసిక్ వరల్డ్ రీ బర్త్ రిలీజ్ టైమ్ లో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అవ్వనుంది.

అలా నోలన్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇవ్వగా.. ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. వరల్డ్ నెం.1 డైరెక్టర్ అప్డేట్ ఇచ్చేశారని.. మరి మన నెం.1 డైరెక్టర్ ఎప్పుడిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. చాలా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరి గురించి వారు అంటున్నారో.. ఇప్పటికే ఐడియా వచ్చేసుంటుంది.. ఆయనే ఎస్ ఎస్ రాజమౌళి.

బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతినే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా విశ్వవ్యాప్తం చేశారు. పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అడ్వెంచర్ జోనర్ లో సినిమా తీస్తున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. షూటింగ్ ను మాత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు.

రాజమౌళి.. ఇప్పటి వరకు తన సినిమాల విషయంలో చేసినట్లుగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. గత చిత్రాల సమయంలో షూటింగ్ మొదలవ్వడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి అన్ని డిటైల్స్ షేర్ చేశారు. కానీ ఇప్పుడు మహేష్ మూవీ విషయంలో మాత్రం భిన్నంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారో తెలియట్లేదు.

అది ఆయన స్ట్రాటజీలో భాగమని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. అప్డేట్స్ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అనేక ఈవెంట్స్ లో రాజమౌళి సందడి చేస్తున్నా.. కనీసం ఒక్క మాట కూడా మహేష్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం లేదు. దీంతో ఏదో ఒక్క అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మహేష్ బర్త్ డే ఉంది కనుక.. అప్పుడైనా అప్డేట్ ఇవ్వాలని అడుగుతున్నారు. మరి రాజమౌళి ఏం చేస్తారో.. ఏ ప్లాన్ తో ఉన్నారో..