Begin typing your search above and press return to search.

ఈ స్టార్ హీరోల్లో క్రిస్మస్​ 'కింగ్​' ఎవరో​

మంచి విందు భోజనం అందించనున్నారు

By:  Tupaki Desk   |   24 July 2023 8:23 AM GMT
ఈ స్టార్ హీరోల్లో  క్రిస్మస్​ కింగ్​ ఎవరో​
X

ఓ సినిమా విడుదలంటే సవాలక్ష లెక్కలుంటాయన్న సంగతి తెలిసిందే. మామూలు రోజుల్లో ఓ చిత్రాన్ని విడుదల చేయడానికీ పండగ సమయంలో రిలీజ్​ చేయడానికి ఎంతో తేడా ఉంటుంది. పండగ సమయాల్లో ఆడియెన్స్​ సినిమా చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

అందుకే మన దర్శకనిర్మాతలు కూడా స్టార్ హీరోల చిత్రాలను అప్పుడే రిలీజ్​ చేసేందుకు ముందుగానే కర్చీలు వేస్తుంటారు. ఇప్పటికే సంక్రాంతి ముగిసింది. ఇంకా దసరా, దీపావళి, క్రిస్మస్​. అయితే ఇయర్ ఎండ్ క్రిస్మస్​ రావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయితే అప్పుడు ఆ సీజన్​పై నలుగురు టాలీవుడ్​ స్టార్ హీరోలు కర్చీఫ్స్ వేశారు. మంచి విందు భోజనం అందించనున్నారు. అవేటంటంటే..

'దసరా' చిత్రంతో వంద కోట్ల హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'హాయ్ నాన్న'.. డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సెంటిమెంట్​గా రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటిస్తోంది. క్రిస్మస్ బరిలో మరో చిత్రం వై ఓల్టేజ్ యాక్షన్​ ఎంటర్​టైనర్​ 'సైంధవ్'. విక్టరీ వెంకటేష్ కెరీర్​లో 75వ మైల్​స్టోన్​ సినిమాగా రూపొందింది. 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్​ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 22న రానుంది.

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న 'హరోం హర' కూడా డిసెంబర్ 22నే రిలీజ్ కానుంది. ఇప్పటికే 'ఫస్ట్ ట్రిగ్గర్' పేరుతో వచ్చిన ఓ స్పెషల్ వీడియో ఆకట్టుకుంది. 'అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు. కానీ, ఇది యాడెడో తిరిగి నన్ను పట్టుకుంది' అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ప్రత్యేకంగా నిలిచింది.

ఈ పండగ బరిలో దిగనున్న మరో సినిమా.. నితిన్​ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'. డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వక్కంతం వంశీ దర్శకుడు. ఒక్క నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' తప్ప మిగతా వన్నీ పాన్​ ఇండియా స్థాయిలో రానున్నాయి.

వీటన్నింటితో పాటు బాలీవుడ్​ బాద్​ షా నటిస్తున్న కొత్త చిత్రం డంకీ. వైవిధ్య కథల దర్శకుడు రాజ్​కుమార్ హిరానీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​కానుంది. ఇప్పుటికే షారుక్.. పఠాన్​ బ్లాక్​ బాస్టర్​ హిట్​తో జోరుమీదున్నారు. త్వరలోనే జవాన్​తో రానున్నాయి. ఇక ఇది కూడా హిట్​ అయితే.. డంకీపై మరింత అంచనాలు పెరిగిపోవడం ఖాయం.