Begin typing your search above and press return to search.

సుకుమార్ తో షూట్ అంటే.. ఇలా ఉంటది మరి

ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాలోని జాతర సాంగ్ కి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:12 AM GMT
సుకుమార్ తో షూట్ అంటే.. ఇలా ఉంటది మరి
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ సినిమా చేసిన అందులో ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిలింగ్ గా చెబుతూ ఉంటారు. ఆయన సినిమాలలో వాడే ప్రాపర్టీకి కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథ కూడా సినిమా నడుస్తున్నంత సేపు బ్యాగ్రౌండ్ లో ఆడియన్స్ కి కనిపిస్తూ ఉంటుంది. అలాగే అవుట్ ఫుట్ విషయంలో కూడా ఎక్కడ రాజీపడరు.

తనకి కావాల్సిన ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ వచ్చే వరకు ఎన్ని టేక్ లు అయిన చేయిస్తారు. యాక్టర్స్ కూడా సుకుమార్ పెర్ఫెక్షన్ కి అలవాటు పడిపోయారు. అతనితో సినిమా చేస్తే కచ్చితంగా నటుడిగా నెక్స్ట్ లెవల్ ఇమేజ్ వస్తుంది. అందుకే సుకుమార్ ఎంత టైం తీసుకున్న, ఎన్ని టేక్ లు అడిగిన కాదనకుండా చేస్తారు. టెక్నీషియన్స్ కూడా చాలా ఓపికగా వర్క్ చేస్తారు. ఈ కారణంగానే సుకుమార్ అంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాలోని జాతర సాంగ్ కి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ చేశారు. ఈ సాంగ్ ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. నిజానికి సాంగ్ రెండు, మూడు రోజుల్లో పూర్తయిపోతుందని అనుకున్నారంట. దానికి తగ్గట్లుగానే కాల్ షీట్స్ మాట్లాడుకోవడం జరిగిందని తెలుస్తోంది. అయితే సుకుమార్ మాత్రం తన పెర్ఫెక్షన్ కోసం డాన్స్ మూమెంట్స్ కూడా చాలా రకాలు కంపోజ్ చేయించారంట.

ఈ కారణంగా షూటింగ్ వారం రోజులు అయ్యిందని టాక్ వినిపిస్తోంది. దీంతో కాల్ షీట్స్ పెరిగి బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యిందని సమాచారం. గణేష్ ఆచార్య కూడా ఈ సాంగ్ మొత్తం అయ్యాక అవుట్ ఫుట్ విషయంలో సంతృప్తి చెందారంట. గతంలో పుష్ప మూవీ కూడా బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం రిలీజ్ కి ముందు రోజు వరకు సుకుమార్ ఎడిటింగ్ రూమ్ లోనే కూర్చున్నారంట.

ఫైనల్ గా మంచి అవుట్ ఫుట్ ఇవ్వడంతో పుష్ప మూవీ సూపర్ హిట్ అయ్యింది. పుష్ప2 మూవీతో అంతకు మించిన రిజల్ట్, కలెక్షన్స్ సాధించాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అవుట్ ఫుట్ రెడీ చేస్తున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టారు.