Begin typing your search above and press return to search.

న‌టుడి స‌డెన్ డెథ్.. ఊహించ‌ని ఫ్యాన్స్ షాక్‌లో!

చోయ్ జంగ్ వూ ఎవరు? అన్న‌ది ఆరా తీస్తే, 1957లో జన్మించిన చోయ్ జంగ్ వూ ప‌లు కొరియన్ షోలలో తన సహాయక పాత్రలతో పాపుల‌ర‌య్యారు.

By:  Tupaki Desk   |   28 May 2025 12:27 AM IST
న‌టుడి స‌డెన్ డెథ్.. ఊహించ‌ని ఫ్యాన్స్ షాక్‌లో!
X

సిటీ హంటర్, డాక్టర్ స్ట్రేంజర్, ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ వంటి ప‌లు హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణ కొరియా నటుడు చోయ్ జంగ్ వూ మరణించారని స్థానిక మీడియాలు ధృవీకరించాయి. కొరియా-బూ మీడియా అందించిన వివ‌రాల‌ ప్రకారం.. ఆయన వయసు 68. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు.

చోయ్ జంగ్ వూ ఎవరు? అన్న‌ది ఆరా తీస్తే, 1957లో జన్మించిన చోయ్ జంగ్ వూ ప‌లు కొరియన్ షోలలో తన సహాయక పాత్రలతో పాపుల‌ర‌య్యారు. 1975లో `ది లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్` అనే నాటకంతో న‌టుడిగా అరంగేట్రం చేశారు. ఆయన తన నటనా జీవితాన్ని థియేటర్‌లో ప్రారంభించారు. షిన్సీ వంటి కంపెనీలలో డ్రామా ఆర్టిస్టుగా పనిచేశారు. రంగస్థల నటనతో పాటు అత‌డి ప్ర‌యోగాత్మ‌క శైలి ప్రేక్ష‌కుల‌కు ఇష్టం. అత‌డు ప్ర‌తిభావంతుడైన వాయిస్ ఆర్టిస్టు కూడా.

గాడ్స్ క్విజ్, టూ కాప్స్, పబ్లిక్ ఎనిమీ 2, సింపతీ ఫర్ లేడీ వెంజియన్స్, ది చేజర్, బ్రిలియంట్ లెగసీ, ప్రాసిక్యూటర్ ప్రిన్సెస్, గుమిహో: టేల్ ఆఫ్ ది ఫాక్స్ చైల్డ్, మిడాస్, మై డాటర్ సియో యంగ్, మాస్టర్స్ సన్, కాల్ ఇట్ లవ్, టైరెంట్, హూ ఈజ్ షీ! , ది టేల్ ఆఫ్ లేడీ ఓకే వంటి కె-డ్రామాల్లో నటించాడు. లీ మిన్ హో - సిటీ హంటర్ , ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ వంటి కె-డ్రామాల్లో నటించి చాలా పేరు తెచ్చుకున్నాడు. లీ జోంగ్ సుక్ నటించిన డాక్టర్ స్ట్రేంజర్ చిత్రాలలో కూడా భాగమ‌య్యాడు. చోయ్ జంగ్ వూ అంత్యక్రియల వివ‌రాల‌కు వ‌స్తే, ఈ అంత్యక్రియలు గింపో వూరి హాస్పిటల్ ఫ్యూనరల్ హోమ్‌లో జరుగుతాయ‌ని తెలిపారు. అంతిమ యాత్ర ఊరేగింపు మే 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.