Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో అతనొక్కడే..!

విక్రం విషయంలో అదే జరుగుతుంది. ఈ హీరో సరైన హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ప్రతి సినిమాకు తను పడే కష్టం ఒకటే.

By:  Tupaki Desk   |   25 Aug 2023 2:45 AM GMT
కోలీవుడ్ లో అతనొక్కడే..!
X

కమల్ తర్వాత సౌత్ ఆడియన్స్ ని తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరో విక్రం. తమిళ ఫ్యాన్స్ ముద్దుగా చియాన్ అని పిలిచుకునే విక్రం కెరీర్ మొదటి నుంచి ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సినిమాలో విభిన్నమైన పాత్ర అంటే చాలు ఆ సినిమా చేసేందుకు విక్రం సరే అనేస్తాడు. ప్రేక్షకులకు కొత్త పాత్రల పరిచయం.. కొత్త కథల రుచిని తెలియచేసేందుకు ప్రయోగాలు చేస్తూ వచ్చారు విక్రం. కమల్ తర్వాత అంతటి విలక్షణ నటన ఆయన సొంతమనే చెప్పొచ్చు. అయితే ఎప్పుడూ విలక్షణ కూడా పనికిరాదు. అంటే సినిమా కమర్షియల్ హిట్ కొట్టాలంటే ప్రయోగాలు కొంతమేరకు పని చేసినా అదే పనిగా చేస్తూ పోతే ప్రేక్షకులకు విసుగొస్తుంది.

విక్రం విషయంలో అదే జరుగుతుంది. ఈ హీరో సరైన హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ప్రతి సినిమాకు తను పడే కష్టం ఒకటే. అంతేకాదు సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నా అవేవి వర్క్ అవుట్ కావట్లేదు. విక్రం మార్క్ హిట్ సినిమా పడి చాలా రోజులవుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తో సత్తా చాటుతున్న చాలామంది అప్పట్లో విక్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయే వారు.

అలాంటి విక్రం ఖాతాలో ఒక్క హిట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. సినిమా తర్వాత సినిమా చేస్తూనే ఉన్నా కథల ఎంపికో లేదా పాత్రల ప్రభావమో కానీ విక్రం సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. తన ఫ్యాన్స్ ఆకలి తీర్చాలని ప్రయత్నిస్తున్నా సరే విక్రం ఆ విషయంలో సక్సెస్ అవలేకపోతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ లో ఫాం లో లేని కమల్ హాసన్, రజినికాంత్ లు కూడా తిరిగి ఫాంలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర తమ స్టామినా చూపిస్తున్నారు.

కోలీవుడ్ లో విక్రం ఒక్కడే బాక్సాఫీస్ దగ్గర వెనకబడి ఉన్నాడు. విక్రం కూడా ఫాం లోకి వస్తే కోలీవుడ్ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. ప్రస్తుతం కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న దృవ నక్షత్రం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్న విక్రం ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన P.S 1, 2 సినిమాలు తమిళంలో హిట్ అనిపించుకున్నా పాన్ ఇండియా లెవెల్ లో నిరాశపరిచాయి. మరి విక్రం కమ్ బ్యాక్ ఎప్పుడు ఏ సినిమాతో అవుతుందని ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తున్నారు.