Begin typing your search above and press return to search.

వీడియో: తంగ‌ళ‌న్ గెట‌ప్ కోసం చియాన్ క‌ష్టం

2024లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో క‌ల్కి, గేమ్ ఛేంజర్ ల‌తో పాటు త‌మిళం నుంచి విక్ర‌మ్ తంగ‌లాన్, సూర్య కంగువ కూడా ఉన్నాయి

By:  Tupaki Desk   |   17 April 2024 8:03 AM GMT
వీడియో: తంగ‌ళ‌న్ గెట‌ప్ కోసం చియాన్ క‌ష్టం
X

2024లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో క‌ల్కి, గేమ్ ఛేంజర్ ల‌తో పాటు త‌మిళం నుంచి విక్ర‌మ్ తంగ‌లాన్, సూర్య కంగువ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల ప్ర‌మోష‌న‌ల్ వీడియోలు స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇక చియాన్ విక్ర‌మ్ తంగ‌ళ‌న్ తొలి నుంచి జ‌నాల్లో హాట్ టాపిక్ గా మారింది. తంగ‌ళ‌న్ త్వ‌ర‌లో రిలీజ్ కానున్న సంద‌ర్భంగా ప్ర‌చారం ఇటీవ‌ల ఊపందుకుంది.

తాజాగా చియాన్ విక్రమ్ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని చిత్ర‌బృందం ఒక ప్ర‌త్యేక వీడియోని షేర్ చేయగా అది వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో విక్రమ్ తన పాత్ర తాలూకా హావ‌భావాలు, వేష‌ధార‌ణ కోసం ఎంత‌గా శ్ర‌మిస్తారో ఎంత‌గా అంకితభావం ప్ర‌ద‌ర్శిస్తారో అవ‌గ‌త‌మ‌వుతోంది. అత‌డి వేషం.. భాష‌.. ఆహార్యం, కాస్ట్యూమ్స్.. మేక‌ప్ ఇలా ప్ర‌తిదీ అన్నిర‌కాలుగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. పా రంజిత్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా విక్ర‌మ్ కెరీర్ లో మ‌రో క‌లికితురాయి కానుంద‌న్న న‌మ్మ‌కాన్ని తాజా వీడియో పెంచుతోంది. నిజ‌ఘటనల ఆధారంగా ఒక చారిత్రక సాహస కథను అందించాలనే లక్ష్యంతో జియో స్టూడియోస్- స్టూడియో గ్రీన్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజా వీడియో అభిమానుల్లోకి దూసుకెళ్లింది. విక్ర‌మ్ స‌ర్ కి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇది అని ద‌ర్శ‌కుడు అన్నారు.

విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ ఇందులో క‌థానాయిక‌లు. పశుపతి, హరి కృష్ణన్, డేనియల్ కాల్టాగిరోన్, ప్రీతి కరణ్, వెట్టై ముత్తుకుమార్ త‌దిత‌రులు న‌టించారు. శ్రీమతి జ్యోతి దేశ్‌పాండే - పా రంజిత్ - జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తంగలన్ అతి త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.