Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో రెండు నెలల్లో రెండు...!

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలను ప్రేక్షకులకు అందించడంలో విఫలం అవుతున్నాడు

By:  Tupaki Desk   |   24 March 2024 5:39 AM GMT
స్టార్‌ హీరో రెండు నెలల్లో రెండు...!
X

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలను ప్రేక్షకులకు అందించడంలో విఫలం అవుతున్నాడు. అయినా కూడా ఆయన సినిమాల కోసం తమిళ నాట ఎదురు చూసే వారు భారీగానే ఉంటారు అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ను సమ్మర్‌ కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఎన్నికల హడావుడి మరియు ఇతర విషయాలపై ఒక స్పష్టత వచ్చిన తర్వాత అంటే మే నెలలో సినిమాను విడుదల చేయాలని దర్శకుడు పా రంజిత్ ప్లాన్‌ చేస్తున్నాడట. తంగలాన్ సినిమా కంటే ముందే విక్రమ్‌ నటించిన పాత సినిమా ధ్రువ నక్షత్రం సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చాలా ఏళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న ధ్రవ నక్షత్రం సినిమా ను ఎట్టకేలకు విడుదలకు సిద్ధం చేశారు. ఆ మధ్య విడుదల తేదీని ప్రకటించి రిలీజ్ కు ప్రమోషన్ కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా ఏప్రిల్‌ 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను రెడీ అవుతున్నట్లుగా దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ పేర్కొన్నాడు. ఇదే కనుక నిజం అయితే ఏప్రిల్‌ లో విక్రమ్‌ ధ్రవ నక్షత్రం సినిమాతో రాబోతుండగా, మే నెలలో తంగలాన్ సినిమాతో రాబోతున్నాడు. రెండు నెలల్లో రెండు సినిమాలతో విక్రమ్‌ రాబోతున్నాడు. రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి విక్రమ్‌ హిట్‌ ఇచ్చేనా చూడాలి.