Begin typing your search above and press return to search.

స్టేషన్​లో చియాన్ విక్రమ్​ జులుం.. భయపడిన పోలీస్​!

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించే తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్.

By:  Tupaki Desk   |   29 Oct 2023 8:55 AM GMT
స్టేషన్​లో చియాన్ విక్రమ్​ జులుం.. భయపడిన పోలీస్​!
X

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించే తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్. ఆయన నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. అయితే ఆయన ప్రస్తుతం ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ గ్లింప్స్​ను విడుదల చేసింది మూవీటీమ్. ఇది ఆద్యంతం ఇంట్రెస్టింగ్​గా​ మాస్​గా కనిపిస్తూ అలరిస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. ఎలాంటి పాత్రనైనా కొత్తగా, ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసే అద్భుతమైన నటుల్లో విక్రమ్ ఒకరు. పితామ‌గ‌న్, సామి, అప‌రిచితుడు లాంటి భారీ విజ‌యాల‌ను అందుకున్న ఆయనకు.. ప్రస్తుతం భారీ హిట్లు పడట్లేదు. అయినా ఆయన నుంచి పెద్ద సినిమాలే వస్తున్నాయి. త్వరలోనే ఆయన క‌బాలి ద‌ర్శ‌కుడు పా.రంజిత్‌తో చేసిన తంగ‌లాన్ చిత్రంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దీంతో పాటే విక్ర‌మ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. విక్ర‌మ్ 62వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ను కూడా విడుదల చేశారు. రూరల్ డ్రామాగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ స్టేష‌న్లోకి ఒక మ‌హిళ త‌న‌ను ఇద్ద‌రు రౌడీలు అల్ల‌రి చేశారని కంప్లైంట్ చేయ‌డానికి వ‌స్తుంది. అప్పుడు స్టేషన్​లో అధికారులు ఎవరి పనిలో వారు ఉంటారు. ఈ లోగా ఓ ఇద్ద‌రూ దెబ్బ‌లు తింటూ వచ్చి పోలీస్ స్టేష‌న్లోకి ప‌డ‌తారు. వాళ్లను హీరో చియాన్​ విక్రమ్​ కొట్టుకుంటూ తీసుకొస్తారు.

దీంతో స్టేష‌న్​లో గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతుంది. జులుం చూపించిన హీరోను ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. అప్పుడు ఓ పోలీసుకు త‌న గురించి చెవిలో ఏదో చెబుతాడు హీరో. అప్పుడా పోలీస్ భ‌య‌ప‌డ‌తాడు. మరీ ఇంత‌కీ హీరో ఏం చెప్పాడు? అతడి నేప‌థ్యం ఏంట‌న్న‌దే ఈ క‌థ‌లా తెలుస్తోంది. ఇకత చివ‌ర్లో జాతరలో ఒక మామూలు స్కూట‌ర్ మీద మార్కెట్ వ‌స్తువులు తీసుకెళ్తూ క‌నిపించాడు హీరో. మొత్తంగా టీజ‌ర్ రొటీన్‌కు భిన్నంగానే కనిపించింది. డిఫరెంట్​ ఎంట‌ర్టైన‌ర్ చూడ‌బోతున్న ఫీలింగ్ క‌లిగించింది.

కాగా, రీసెంట్​గా అరుణ్ కుమార్​.. సిద్దార్థ్‌తో చిత్తా అనే సినిమా తీసి మంచి హిట్ అందుకున్నారు.