Begin typing your search above and press return to search.

బంగారు బ్లౌజు వంగ పువ్వు చీర‌లో న‌టి క‌వ్వింత‌

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతోంది. బంగారు బ్లౌజు వంగ పువ్వు రంగు చీర‌లో చిత్రాంగ‌ద‌ క‌వ్వింత కుర్రకారులో చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   12 April 2025 8:45 AM IST
బంగారు బ్లౌజు వంగ పువ్వు చీర‌లో న‌టి క‌వ్వింత‌
X

చిత్రాంగ‌ద సింగ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్‌'లో తన నటనతో ఈ బ్యూటీ హృదయాలను గెలుచుకుంది. ఈ వెబ్ సిరీస్‌ విజయం త‌ర్వాత‌ బిజీ షెడ్యూళ్ల న‌డుమ ముంబైలోని ఒక రెస్టారెంట్ వెలుపల కనిపించింది. చిత్రాంగ‌ద మునుప‌టి కంటే జోష్ తో క‌నిపించింది. ఆ స‌మ‌యంలో కెమెరాలకు పోజులివ్వడమే గాక‌, స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌తో చ‌నువుగా మాట్లాడింది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతోంది. బంగారు బ్లౌజు వంగ పువ్వు రంగు చీర‌లో చిత్రాంగ‌ద‌ క‌వ్వింత కుర్రకారులో చ‌ర్చ‌గా మారింది. చిత్రాంగ‌ద‌లో మునుప‌టి కంటే గ్లో పెరిగిందంటూ గుస‌గుస‌లు పెరిగాయి. నిజానికి ఈ గ్లో వెన‌క స‌క్సెస్ మాయాజాలం ప‌ని చేస్తోంద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఇప్పుడిలా ప‌విట కొంగు నిల‌వ‌నంత‌గా చిత్రాంగ‌ద‌ ఫోటోషూట్ల‌తో ఆక‌ర్షిస్తోంద‌ని ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

త‌న కెరీర్ లో రెండవ వెబ్ సిరీస్ 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్‌' త‌న‌కు మంచి పేరు తెచ్చింది. దీని కంటే ముందు చిత్రాంగద 2022 వెబ్ షో 'మోడరన్ లవ్ ముంబై'లో కనిపించింది. ఇటీవల జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రతిభ ఉన్నా కానీ తాను ఆశించిన బలమైన పాత్రల్ని ద‌ర్శ‌కులు ఆఫర్ చేయ‌లేదని ఆవేద‌న చెందింది. నిజాయితీగా చెప్పాలంటే నేను ఇలాంటి పాత్రను పోషించి చాలా కాలం అయింది. ఇటీవ‌ల ఇంత ఆసక్తికరమైన పాత్ర‌ ఏదీ రాలేదు. నేను ఈ పాత్ర‌ను నిజంగా ఆస్వాధించాను. అన్నివేళ‌లా నేను సహజంగానే ఇలాంటి పాత్రల వైపు మొగ్గు చూపుతాను. ప‌ర్ఫెక్ట్ గా రాసిన పాత్ర ఇది! అని తెలిపారు.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్‌లో నిబేదిత అనే పాత్ర‌లో న‌టించింది. ఈ పాత్ర‌ గురించి చిత్రాంగ‌ద మాట్లాడుతూ... ఒడిదుడుకుల ప్ర‌యాణంలో నిబేదిత ఎలా ముందుకు సాగింద‌నేది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అది న‌చ్చ‌డం వ‌ల్ల‌నే మూవీలో భాగం కావాలనుకున్నాను. కాబట్టి భావోద్వేగపరంగా, వృత్తిపరంగా ఈ ప్ర‌యాణం బావుంది! అని తెలిపింది.

గత సంవత్సరం ఖేల్ ఖేల్ మెయిన్‌లో చిన్న పాత్ర‌లో కనిపించిన తర్వాత, చిత్రాంగద ఇప్పుడు రెండు కొత్త చిత్రాలలో అవ‌కాశాలు అందుకుంది. హౌస్‌ఫుల్ 5, రాత్ అకేలి హై 2 లో త‌దుప‌రి కనిపిస్తుంది. రాత్ అకేలి హై 2లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుంది.