Begin typing your search above and press return to search.

1177 కి.మీల గమ్యం.. జర్నీ టు అయోధ్య..

రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అఫీషియల్ అప్డేట్ రాలేదు

By:  Tupaki Desk   |   17 April 2024 9:40 AM GMT
1177 కి.మీల గమ్యం.. జర్నీ టు అయోధ్య..
X

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే అనేక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. గతే ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అఫీషియల్ అప్డేట్ రాలేదు.

ఇప్పుడు టాలీవుడ్ లో రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి రెండో సినిమాను ప్రకటించారు. జర్నీ టు అయోధ్య వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ ప్రాజెక్ట్ కు కథ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య నేతృత్వంలోనే పలువురు షూటింగ్ కోసం అయోధ్యతో పాటు కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తమ్మారెడ్డి భరద్వాజ పర్యవేక్షిస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో సినిమాకు సంబంధించి అన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్. మూవీ అనౌన్స్మెంట్ సమయంలో పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో రాముడు ఒక బ్యాగ్ పట్టుకుని అయోధ్యకు వెళ్తున్నట్లు చూపించారు. ఇంకా 1177 కిలోమీటర్ల గమ్యం ఉన్నట్లు రాసి ఉంది. పోస్టర్ లో #AAGAMAN 2025 ట్యాగ్ ను మెన్షన్ చేశారు మేకర్స్. దీని బట్టి చూస్తే.. ఈ సినిమా 2025లో విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. కంప్లీట్ డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు సందడి చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా అద్భుతంగా తీసి హిట్ కొట్టాలని సూచిస్తున్నారు. అయోధ్య బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.