Begin typing your search above and press return to search.

విశ్వంభర లో మెగా సర్ ప్రైజ్..?

మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో విశ్వంభర సినిమా వస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   5 May 2024 7:03 PM GMT
విశ్వంభర లో మెగా సర్ ప్రైజ్..?
X

మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో విశ్వంభర సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సినిమా లో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. రెండు దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తున్నా త్రిష తెలుగు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. దాదాపు అమ్మడు దశాబ్దం తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది.

మెగా విశ్వంభర సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వశిష్ట. సినిమాలో చిరు నెవర్ బిఫోర్ అనేలా చూపిస్తున్నాడట. రీ ఎంట్రీ తర్వాత చిరు రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న టాక్ వచ్చింది. దానికి ఆన్సర్ ఇచ్చేలా చిరు రిస్కీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ చేసి విశ్వంభర ది బెస్ట్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. అందుకే సినిమా కోసం చిరంజీవి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో వశిష్ట మరో మెగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. చిరు విశ్వంభర సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకునేనే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం రచ్చ రంబోలా చేస్తారు. చిరు విశ్వంభరలో ఆ ఛాన్స్ ఉంటుందని టాక్.

అన్నయ్య సినిమా అంటే చిరు నో చెప్పే ఛాన్స్ లేదు. వశిష్ట ప్లాన్ కు చిరు కూడా సరే అన్నట్టు టాక్. విశ్వంభర సినిమాలో పవన్ గెస్ట్ రోల్ ఉంటే మాత్రం ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సినిమా గురించి ఫస్ట్ టీజర్ గా వచ్చిన వీడియో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తున్న విశ్వంభర సినిమా మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందుగా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. విశ్వంభర సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. సినిమా హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఉండేలా కృషి చేస్తున్నారు అకాడమీ విన్నర్ ఎం.ఎం కీరవాణి.