Begin typing your search above and press return to search.

ఉఫ్‌..! త‌మ‌న్నాను మెగా బాస్ అలా పిలిచేవార‌ట‌!!

మొత్తానికి భోళాశంక‌ర్ సెట్స్ లో త‌మ‌న్నా కంటే 'త‌మ‌న్' అనే పేరే ఎక్కువ‌గా వినిపించింద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   22 July 2023 4:51 AM GMT
ఉఫ్‌..! త‌మ‌న్నాను మెగా బాస్ అలా పిలిచేవార‌ట‌!!
X

'సైరా న‌ర‌సింహారెడ్డి' త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న మ‌రో క్రేజీ అవ‌కాశాన్ని త‌మ‌న్నా అందిపుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. మెగా బాస్ క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న భోళాశంక‌ర్ లో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. భోళా శంకర్ టీజ‌ర్లు పాట‌ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. నిర్మాతలు ఈ రోజు 'మిల్కీ బ్యూటీ..' అంటూ సాగే కొత్త పాటను ఆవిష్కరించారు. మహతి స్వర సాగర్ ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించిన ఈ పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. దీనిని మహతి స్వర సాగర్ - విజయ్ ప్రకాష్ - సంజన కల్మంజే ఆకట్టుకునే విధంగా పాడారు. లిరికల్ వీడియోలో మెగాస్టార్ హుషారుగా కనిపిస్తూ తన సింపుల్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార కంటెంట్ లో చిరు స్టైలిష్ లుక్ లు అందరి దృష్టిని ఆకర్షించాయి.

పాటలో తమన్నా గ్లామర్ అభిమానుల‌కు కిక్కిచ్చింది. అంతేకాదు.. భోళాశంక‌ర్ సెట్స్ లో త‌మాషా సంగ‌తుల‌న్నిటినీ త‌మ‌న్నా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో నెమ్మ‌దిగా ఓపెన‌వుతోంది. తాజా చాటింగ్ సెష‌న్ లో త‌మ‌న్నా చెప్పిన ఓ సంగ‌తి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. షూటింగ్ స‌మ‌యంలో సెట్స్ లో ఉన్న త‌న‌ను మెగాస్టార్ 'త‌మ‌న్' అని పిలిచేవార‌ట‌.

ఆయ‌న అలా పిలిచిన ప్ర‌తిసారీ అంద‌రూ అటే చూసేవారు త‌మ‌న్ వ‌చ్చాడేమోన‌ని. త‌మ‌న్నా బ‌దులుగా త‌మ‌న్ అని చిరు పిలిచేవార‌ని త‌మ‌న్నా స్వ‌యంగా వెల్ల‌డించింది. త‌మ‌న్ అని పిల‌వ‌గానే తాను అటే చూసేవాడిన‌ని మెహ‌ర్ సైతం ధృవీక‌రించారు.

మొత్తానికి భోళాశంక‌ర్ సెట్స్ లో త‌మ‌న్నా కంటే 'త‌మ‌న్' అనే పేరే ఎక్కువ‌గా వినిపించింద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అలా భోళా సెట్స్ లో త‌మ‌న్ అంద‌రి త‌ల‌లో నాలుక అయ్యాడు.

త‌న‌కు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ ఎలా వ‌చ్చింది? అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన త‌మ‌న్నా.. త‌న రంగు చూసి మాత్ర‌మే త‌న‌ను అలా పిల‌వ‌లేద‌ని ఇదంతా తెలుగు ప్ర‌జ‌ల అభిమానం అని పేర్కొంది. ఈ అదృష్టానికి మిల్కీ బ్యూటీ మురిసిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన ప్రోమోలు పోస్ట‌ర్ల‌తో భోళాశంక‌ర్ లో త‌మ‌న్నా గ్లామ‌ర్ ట్రీట్ మ‌రో లెవ‌ల్లో ఉండ‌నుంద‌ని అర్థమ‌వుతోంది.

ఈ సినిమాలో మెగా బాస్ స్టైల్ ఆహార్యం మ‌రో లెవ‌ల్లో ఆక‌ట్టుకోనున్నాయ‌ని ప్ర‌చార మెటీరియ‌ల్ తో భ‌రోసా క‌లిగింది. చిరు-త‌మ‌న్నా జోడీ రొమాన్స్ పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్- సుశాంత్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల కానుంది.