Begin typing your search above and press return to search.

శ్రీ‌మ‌తి సురేఖ పుట్టిన‌రోజున చిరు క‌విత‌

ఇంత‌లోనే ఇప్పుడు మ‌రో కొత్త ఫోటోను షేర్ చేసిన చిరు, ఇందులో భార్య‌నుద్ధేశించి అద్భుత‌మైన క‌విత‌ను రాసారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 6:08 AM GMT
శ్రీ‌మ‌తి సురేఖ పుట్టిన‌రోజున చిరు క‌విత‌
X

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి చిన్నపాటి విహారయాత్ర కోసం అమెరికా వెళ్లారు. ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజున చిరంజీవి తన అభిమానులకు ఒక అంద‌మైన సందేశాన్ని కూడా ఇచ్చారు. ప్రేమ, ఉత్సాహం స‌రిప‌డే మోతాదు...అనే వ్యాఖ్య‌ను షేర్ చేసారు. తన బిజీ షెడ్యూల్ నుండి కొంత విరామం తీసుకొని తన ప్రియమైన భార్య సురేఖతో నాణ్యమైన సమయాన్ని ఆస్వాధించడానికి వెకేష‌న్ కోసం అమెరికా వెళ్లారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఓ సెల్ఫీని కూడా షేర్ చేయ‌డం అభిమానుల్లో ఆనందం నింపింది.

మెగా ప్రాజెక్ట్ 'విశ్వంభర' షూటింగ్‌కి తిరిగి వస్తానని అభిమానులకు భరోసా ఇస్తూ అందరికీ మెగాస్టార్ ప్రేమ ఉల్లాసాన్ని పంచుతూ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇంత‌లోనే ఇప్పుడు మ‌రో కొత్త ఫోటోను షేర్ చేసిన చిరు, ఇందులో భార్య‌నుద్ధేశించి అద్భుత‌మైన క‌విత‌ను రాసారు.

నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ .. నా భాగస్వామి సురేఖ! అంటూ చిరు ఎమోష‌నల్ గా ఎక్స్ లో పోస్ట్ చేసారు. నా జీవితరేఖ నా శక్తికి గొప్ప మూలస్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు! మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్.. ! అంటూ హార్ట్ ఈమోజీని షేర్ చేసారు. ఇటీవ‌ల చిరు షేర్ చేస్తున్న ప్ర‌తి ఫ్యామిలీ ఫోటో అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి. సెల్ఫీల‌కు అభిమానుల్లో అద్భుత స్పంద‌న‌లు వ‌చ్చాయి. పోస్ట్‌ను లైక్‌లు హార్ట్ ఈమోజీల‌తో నింపారు. బిజీ షెడ్యూల్స్.. వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ల మధ్య కూడా మ‌న‌కు కావాల్సిన వారు ప్రియమైనవారితో ఆనందించే క్షణాల ప్రాముఖ్యతను చిరంజీవి త‌న ప్రాక్టిక‌ల్ లైఫ్ లో నొక్కి చెప్పారు.

విశ్వంభ‌ర విడుదల తేదీని 10 జనవరి 2025న నిర్ణయించారు. చిరంజీవి అభిమానులు ఆయన చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాల‌ని కోరుకుంటున్నారు. మీనాక్షి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, తమన్నా భాటియా, శ్రీలీల కూడా న‌టిస్తున్నారు. వీరంతా విశ్వంభర సెట్స్‌లో చేర‌నున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.