Begin typing your search above and press return to search.

మహానటి ముందు మ్యానేజ్ చేసిన చిరంజీవి..!

సావిత్రి క్లాసిక్స్ బుక్ ఆవిష్కరణలో ఈ విషయం గురించి చెప్పి ప్రేక్షకులను అలరించారు చిరంజీవి.

By:  Tupaki Desk   |   3 April 2024 11:36 AM GMT
మహానటి ముందు మ్యానేజ్ చేసిన చిరంజీవి..!
X

సావిత్రి క్లాసిక్స్ అంటూ మహానటి సావిత్రి జీవితంపై ఆవిష్కరించిన బుక్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మహానటి సావిత్రితో తనకున్న కొద్దిపాటి పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తన తొలి సినిమా పునాదిరాళ్లతోనే చిరంజీవి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సావిత్రి క్లాసిక్స్ బుక్ ఆవిష్కరణలో ఈ విషయం గురించి చెప్పి ప్రేక్షకులను అలరించారు చిరంజీవి.

తన తండ్రికి ఎంతో ఇష్టమైన నటి మహానటి సావిత్రి. ఆయన వల్ల తనకు కూడా సావిత్రి గారి మీద ఇష్టం పెరిగింది. ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. తన మొదటి సినిమా రాజమండ్రిలో షూటింగ్ చేయడానికి వెళ్లగా ట్రైన్ లో తను సావిత్రి గారితో కలిసి నటించబోతున్నానని చెప్పారు. ఆ టైం లో తనకు చెప్పలేని ఆనందం కలిగిందని అన్నారు.

సావిత్రి గారు పంచవటి హోటల్ లో బస చేస్తుంటే ఆమెను కలిశారట. తన పేరు అడిగి తెలుస్కుని తనను దీవించారని చెప్పారు చిరంజీవి. ఇక షూటింగ్ టైం లో ఓ పక్క జల్లు పడుతుంటే షూటింగ్ ఆగిపోగా ఆ టైం లో తనకు డ్యాన్స్ వచ్చని ఎవరో అంటే సావిత్రి గారి ముందు డాన్స్ వేశానని. ఆ టైం లో కాలు జారి కింద పడినా ఆ నొప్పి తెలియకుండా డ్యాన్స్ వేశానని సావిత్రి గారు అది గమనించారని. ఆ తర్వాత ఫ్యూచర్ లో మంచి నటుడివి అవుతావని అన్నారని సావిత్రి తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి.

ఆ తర్వాత ప్రేమ తరంగాలు సినిమాలో సావిత్రి గారు నేను కలిసి నటించాము. సావిత్రి గారికి కొడుకుగా తను చేశానని.. కళ్లతోటి కోటి భావాలు పలికించగల ఏకైక నటి సావిత్రి అలాంటి నటి మళ్లీ పుట్టరని అన్నారు చిరంజీవి. ఆమెతో గడిపిన ఆ కొద్ది క్షణాలను జీవితాతం గుర్తు పెట్టుకుంటా అందుకే తన ఇంట్లో మహానటి సావిత్రి ఫోటో ఉంటుందని అన్నారు చిరంజీవి.

సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వెండితెర మీద ఆమె చెరిగిపోని సంతకం. ఆమె అభినయం చూసి ఎవరైనా మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే. సావిత్రి జీవిత కథతోనే మహానటి సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.