Begin typing your search above and press return to search.

మెగాస్టార్ రెమ్యునరేషన్ పై భోళా దెబ్బ

ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మెగాస్టార్ రెమ్యునరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంట. చిరంజీవి ప్రతి సినిమాకి 70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:04 AM GMT
మెగాస్టార్ రెమ్యునరేషన్ పై భోళా దెబ్బ
X

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ ఆచార్య తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అతని ఖాతాలో చేరింది. బంధువైన మెహర్ రమేష్ ని నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేసి తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ హక్కులు తీసుకొని అన్ని తానై చూసుకున్నారు. అయితే వేదాళం మూవీతో పోల్చుకున్న భోళా శంకర్ ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులని ఎంగేజ్ చేయలేకపోయింది.

దీంతో నిర్మాత అనిల్ సుంకరకి కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం మారింది. ఏజెంట్ తర్వాత అతనిని భోళా శంకర్ కోలుకోలేని దెబ్బ తీసింది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో వాల్తేర్ వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిగిలిన ఖైదీ 150, సైరా నరసింహారెడ్డి హిట్ అనిపించుకున్నాయి. గాడ్ ఫాదర్ ఫ్లాప్ అయ్యింది. తరువాత ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్, భోళా శంకర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గానే మారింది.

ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మెగాస్టార్ రెమ్యునరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంట. చిరంజీవి ప్రతి సినిమాకి 60-70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. దీంతో సినిమా బడ్జెట్ 120 నుంచి 150 కోట్ల వరకు అవుతోంది. అయితే సినిమా బిజినెస్ మాత్రం వంద కోట్లు కూడా దాటడం లేదు. ఇది కొంత వరకు నిర్మాతలని టెన్షన్ పెడుతుందని చెప్పొచ్చు. అలాగే వరుస రీమేక్ చేయడం కూడా కొంత మైనస్ అవుతోంది.

ఈ కారణాల వలన చిరంజీవి నెక్స్ట్ సినిమాల విషయంలో 70 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేరంట. బిజినెస్ లెక్కలు వేసుకుంటూ అంత రెమ్యునరేషన్ ఇవ్వలేమని చెప్పేస్తున్నారంట. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చిరంజీవి తన బడ్జెట్ తగ్గించుకునే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయిన మార్కెట్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగితేనే నిర్మాతలు ఎంత ఖర్చయిన పెడతారు.

అయితే గతంలో చిరంజీవి నుంచి మూవీ వస్తుందంటే హిట్, ఫ్లాప్ అని చూడకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కొత్తగా క్రియేట్ కావడంతో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన మూవీ బాగోలేదు అంటే మొదటి మూడు రోజులకే థియేటర్స్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి సినిమా అయిన భారీ నష్టాలు తప్పడం లేదనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.