Begin typing your search above and press return to search.

బాలయ్య - బాబీ మూవీ... చిరు ఏమన్నారంటే!

ఆల్ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు మన సినిమా వాల్తేరు వీరయ్య కంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకునే విధంగా తీయాలని చెప్పారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:29 AM GMT
బాలయ్య - బాబీ మూవీ... చిరు ఏమన్నారంటే!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గత ఏడాది సంక్రాంతికి చిరంజీవి తో రూపొందించిన వాల్తేరు వీరయ్య సినిమా తో బాబీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అదే బాబీ తన తదుపరి సినిమాను బాలయ్య తో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ప్రారంభం అయిన సమయంలో చిరంజీవి స్పందించారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ గారితో సినిమాను మొదలు పెట్టిన సమయంలో చిరంజీవి గారు కాల్‌ చేసి స్పెషల్‌ విషెష్‌ తెలియజేశారు. ఆల్ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు మన సినిమా వాల్తేరు వీరయ్య కంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకునే విధంగా తీయాలని చెప్పారు.

ఆ సమయంలో చిరంజీవి మాటలు నాకు బూస్ట్‌ ని ఇచ్చాయి. బాలయ్య బాబు గారితో సినిమా హిట్ అవ్వాలని చిరంజీవి గారు వంటి పెద్ద స్టార్‌ నాకు విషెష్‌ చెప్పడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా నమ్మకంగా సినిమాను చేస్తున్నాను అన్నట్లుగా బాబీ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.

ఇద్దరు హీరోల మధ్య పోటీ ఉంటుందని అంతా అనుకుంటారు. అలాంటిది బాలయ్య తో బాబీ చేయబోతున్న సినిమాకు చిరంజీవి ఆల్ ది బెస్ట్‌ చెప్పడం గొప్ప విషయం. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజంగా చిరంజీవి ది గొప్ప మనసు అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. అదే సమయంలో చిరంజీవి తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.